ఢిల్లీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఒకప్పటితో పోల్చుకుంటే ఇటీవల కాలంలో భారీగా తగ్గుముఖం పట్టాయి. ఆందోళనకర పరిస్థితులు నుంచి హమ్మయ్య ఇక ఏం కాదులే అనే స్థితికి ఢిల్లీ ఇప్పుడిప్పుడే చేరుకుంటోంది. అయితే, ఇదే క్రమంలో గత ఆదివారం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో లాక్‌డౌన్‌ను (Delhi lockdown) మే 31 వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. ఆ గడువు కూడా మరో నాలుగు రోజుల్లోనే ముగిసిపోనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీలో ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్ మే 31తో ముగుస్తుండటం, అదే సమయంలో కరోనా కేసులు కూడా తగ్గుముఖం పట్టడంతో ఇక ఢిల్లీలో లాక్‌డౌన్ ఎత్తేస్తారా అనే సందేహాలు కలుగుతున్నాయి. లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తేస్తారా ? లేక గతేడాది తరహాలోనే విడతల వారీగా అన్‌లాక్ చేస్తారా అనే చర్చలు జరుగుతున్నాయి. 


కరోనా పాజిటివ్ కేసులు తగ్గి, రికవరీ రేటు పెరిగిన నేపథ్యంలో ఢిల్లీ సర్కారు సైతం అన్‌లాక్ ప్రక్రియపై దృష్టిసారించింది. విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం.. ఢిల్లీలో జూన్ 1 నుంచి అన్‌లాక్ దశ ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తోంది. అన్‌లాక్ ఫస్ట్ ఫేజ్‌లో హార్జ్‌వేర్, ఎలక్ట్రిక్ షాపులు తెరిచేందుకు అనుమతి ఇవ్వనున్నారని సమాచారం. ఫలితంగా నిర్మాణ రంగంలో మళ్లీ పనులు ప్రారంభం అయ్యేందుకు వీలు ఉంటుంది. అలాగే కిరాణ దుకాణాలు, సెల్ ఫోన్ రిపేరింగ్ షాప్స్, ఏసీ రిపేరింగ్ వంటి దుకాణాలకు లాక్‌డౌన్ (Delhi unlock) నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్టు సమాచారం అందుతోంది.