Delhi Air Quality Alert: ఢిల్లీలో ప్రమాద ఘంటికలు మోగిస్తున్న వాయు కాలుష్యం, స్కూళ్లకు సెలవులు
Delhi Air Quality Alert: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోయింది. గాలి నాణ్యత పడిపోయి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. పరిస్థితి విషమిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. డిల్లీ కాలుష్యంపై పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Delhi Air Quality Alert: శీతాకాలం వచ్చిందంటే చాలు వాతావరణం ఢిల్లీపై పగబడుతుంటుంది. ఇప్పుడు మరోసారి దేశ రాజధానిలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. ఫలితంగా ఎయిర్ ఇండెక్స్ తీవ్రస్థాయికి చేరుకుని ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ముందు జాగ్రత్త చర్యగా స్కూళ్లకు రెండ్రోజులు సెలవులు ప్రకటించారు.
దేశ రాజధాని ఢిల్లీ వాసులకు చలికాలం వచ్చిందంటే చాలు ఓ విధమైన భయం వెంటాడుతుంటుంది. గడ్డకట్టే చలికి భయపడి కాదు. వాతావరణంలో కాలుష్యం అంతగా భయపడుతుంటుంది. ప్రతి యేటా ఇదే సమస్య ఎదురౌతున్నా శాశ్వత పరిష్కారం ఉండటం లేదు. వాయు కాలుష్యం ఈసారి భారీగా పెరిగిపోవడంతో గాలి నాణ్యత అత్యంత దారుణంగా పడిపోయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మొన్న గురువారం ఉదయానికి 346 ఉంటే అదే రోజు సాయంత్రానికి 418కు చేరుకుంది. కొన్ని ప్రాంతాల్లో అత్యధికంగా 486కు చేరుకుంది. రానున్న మూడ్రోజుల్లో ఇది మరింతగా పెరిగి 500 దాటుతుందని అంచనా. నగరం మొత్తాన్ని పొగ కమ్మేసింది. దీనికి తోడు పొగమంచు కూడా ఉండటంతో ఎదుటి వాహనాలు గానీ, వస్తువులు గానీ కన్పించడం లేదు. వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోవడంతో ముందు జాగ్రత్త చర్యగా స్కూళ్లకు రెండ్రోజులు సెలవులు ప్రకటించింది ఢిల్లీ ప్రభుత్వం. మరోవైపు నిర్మాణ పనులపై ఆంక్షలు విధించారు. లైట్ కమర్షియల్ వాహనాలు, డీజిల్ ట్రక్కుల రాకపోకల్ని నిలిపివేశారు.
ఢిల్లీ పొరుగున ఉన్న హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో రైతులు పంట వ్యర్ధాల్ని తగలబెడుతుండటంతో ఢిల్లీ కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇది ఏటా జరిగే వ్యవహారమే అయినా ఏ విధమైన నియంత్రణ చర్యలు చేపట్టడం లేదు. గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వృద్ధులకు శ్వాస సమస్య ఏర్పడుతోంది.
Also read: Tajmahal Controversy: తాజ్ మహల్ మరో వివాదం, షాజహాన్ కట్టలేదంటూ పిటీషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook