Tajmahal Controversy: తాజ్ మహల్. అందమైన పాలరాతి కట్టడం. ప్రపంచ విఖ్యాత పర్యాటక కేంద్రమే కాకుండా ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటి. మొఘల్స్ నిర్మించిన ఈ కట్టడంపై ఇప్పుడు సరికొత్త వివాదానికి తెరతీశారు. ఏకంగా కోర్టును ఆశ్రయించారు.
ఉత్తరప్రదేశ్ ఆగ్రాలోని యమునా నది తీరాన అత్యంత సుందరంగా ఠీవిగా వందల ఏళ్లుగా చెక్కుచెదరకుండా లక్షలాదిగా పర్యాటకుల్ని ఆకర్షిస్తున్న కట్టడం తాజ్ మహల్. ప్రేమకు ప్రతిరూపంగా పిల్చుకునే ఈ అందమైన కట్టడాన్ని మొఘల్ చక్రవర్తుల్లో ఒకడైన షాజహాన్ తన భార్య ముంతాజ్‌పై ప్రేమకు చిహ్నంగా నిర్మించాడు. ఇది చరిత్రే కాదు వాస్తవం కూడా. పూర్తి పాలరాతి కట్టడం ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటిగా భారతదేశానికే గర్వ కారణంగా నిలిచింది. ఇప్పుడీ కట్టడంపై కొత్త వివాదానికి తెరతీశారు కొంతమంది.
తాజ్ మహల్‌ను షాజహాన్ నిర్మించలేదని, చరిత్ర పుస్తకంలో తప్పుల్ని సరిదిద్దాలంటూ హిందూసేన ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. రాజా మాన్ సింగ్ ప్యాలెస్‌కు మార్పులు చేసి తాజ్ మహల్ నిర్మించారనేది ఆ సంస్థ చేసిన ఆరోపణ. జస్టిస్ సతీష్ చంద్ర, జస్టిస్ తుషార్ గెడెలా ధర్మాసనం ఈ పిటీషన్‌పై విచారణ చేపట్టింది. దీనిపై దృష్టి సారించాలంటూ పురావస్తు శాఖను ఆదేశించింది.
తాజ్ మహల్‌కు సంబంధించి తప్పుడు చారిత్రక వాస్తవాల్ని ప్రజలకు బోధిస్తున్నారని హిందూసేన పిటీషన్‌లో పేర్కొంది. తాజ్ మహల్ విషయంలో తాము లోతుగా అధ్యయనం చేశామని, చరిత్ర పుస్తకాల్లో ఉన్న ఈ తప్పుల్ని సరిదిద్ది ప్రజలకు నిజం చెప్పాలని ఆ సంస్థ తెలిపింది.
అయితే తాజ్ మహల్ చుట్టూ వివాదం రేగడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా తాజ్ మహల్ కింద శివాలయం ఉందని, శివాలయాన్ని కూల్చి తాజ్ మహల్ నిర్మాణం చేపట్టారని కొందరు వివాదం లేపారు. తాజ్ మహల్ స్థానంలో తేజో మహల్ అనే దేవాలయం ఉండేదని కూడా వివాదం రాజేశారు. అయితే దీనిపై పురావస్తు శాఖ చాలా స్పష్టమైన వివరణ ఇచ్చింది. తాజ్ మహల్ ఓ స్మారక కట్టడమని అక్కడే విధమైన ఆలయం లేదని చెప్పింది.
Also read: Maharashtra Fire Accident: మహారాష్ట్ర ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం, 7 మంది మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook