దేశ రాజధాని ఢిల్లీ ( Delhi ) లో చలి పంజా విసురుతోంది. అక్టోబర్ నెల నుంచే ఉష్ణోగ్రత తగ్గుతూ వస్తోంది. ఇప్పుడు ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రత ( Delhi records minimum temperature 11 degrees ) 11 డిగ్రీలకు పడిపోయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


శీతాకాలం ( Winter ) ప్రారంభం కాకముందే ఢిల్లీలో చలిగాలులు ప్రారంభమైపోయాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రత తగ్గుతోంది. ఇవాళ ఉదయం దేశ రాజధాని ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 11.4 డిగ్రీలకు పడిపోయింది. ఈ  సీజన్ లో ఇదే అత్యల్ప ఉష్ణోగ్రతని ఐఎండీ తెలిపింది. సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీ ప్రకారం ప్రతియేటా నవంబర్ మొదటి వారంలో కనీసం 15 నుంచి 16 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. నవంబర్ నెలాఖరుకు 11 నుంచి 12 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతుంటుంది.


ఆకాశం మేఘావృతం కాకుండా ఉండటమే కనీస ఉష్ణోగ్రత తక్కువగా ఉండడానికి ప్రధాన కారణమని ఐఎండీ ( IMD ) తెలిపింది. కొండ ప్రాంతాల్లో పెద్దగా హిమపాతం జరగకపోవడంతో ఆ ప్రాంతం నుంచి చల్లని గాలులు ఢిల్లీ వాతావరణాన్ని ప్రభావితం చేయలేదని ఐఎండీ స్పష్టం చేసింది. 58 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో మోస్ట్ కూలెస్ట్ అక్టోబర్ గా నిలిచింది. 1962లో అక్టోబర్ కనిష్ఠ ఉష్ణోగ్రత 16.9 డిగ్రీలుండగా..తిరిగి ఈ ఏడాది అక్టోబర్‌లో సగటు కనిష్ఠ ఉష్ణోగ్రత 17.2 డిగ్రీలుగా నమోదైంది. 


వాస్తవానికి దేశ రాజధానిలో అక్టోబర్‌లో కనీస సగటు కనిష్ఠ ఉష్ణోగ్రత ఎప్పుడూ 19.1 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. 2007 అక్టోబర్‌లో మాత్రం 17.5 డిగ్రీలుగా నమోదైంది. అయితే మూడ్రోజుల క్రితం కనిష్ఠ ఉష్ణోగ్రత ఏకంగా 12.5 డిగ్రీలకు పడిపోయింది. గత 26 ఏళ్లలో అక్టోబర్‌లో అతి తక్కువ ఉష్ణోగ్రత ఇదే. ఐఎండీ డేటా ప్రకారం..1994 అక్టోబర్ 31న 12.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. Also read: India Covid-19: క్రమంగా పెరుగుతున్న కరోనా రికవరీల సంఖ్య