Dental surgery performed by forest official in bandipur: సాధారణంగా ఏనుగులు గుంపులు గుంపులుగా తిరుగుతుంటాయి. అడవుల్లో చెట్ల ఆకులు,  భారీచెట్లను తింటు ఉంటాయి. ఈ నేపథ్యంలో.. కొన్నిసార్లు అడవులకు దగ్గరగా ఉన్న గ్రామాలకు ఏనుగులు వస్తుంటాయి. అవి మూకుమ్మడిగా దాడులు చేస్తుంటాయి.  ఇక కొన్ని ఏనుగులు ఆడ ఏనుగు జాడకోసం తిరుగుతుంటాయి. మదం ఎక్కిన సమయంలో ఏనుగులు చాలా బీభత్సంగా ప్రవర్తిస్తుంటాయి. ఇతర ఏనుగుల మీద దాడిచేయడం,  గ్రామాల మీదకు వెళ్లి పంటపోలాలు, ఇళ్లు ధ్వంసం చేస్తుంటాయి. ఇలాంటివి మనం తరచుగా చూస్తుంటాం. ఇక ఫారెస్ట్ అధికారులు మావటి వాళ్లతో ఇతర ఏనుగులను తీసుకెళ్లి, వాటిని మచ్చిక చేసుకుని తిరిగి అడవిలోకి వెళ్లేలా చేస్తుంటారు. అడవులలో, రైల్వే ట్రాక్ లు దాటుతున్న క్రమంలో అనేక ఏనుగులు ప్రమాదాలకు గురౌతుంటాయి. రైళ్లు స్పీడ్ గా వచ్చి , ఏనుగులను ఢీకొని అవి చనిపోయిన ఘటను అనేకం జరిగాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read more:Yadadri temple: యాదాద్రికి వస్తున్న భక్తులకు అలర్ట్.. జూన్ 1 నుంచి కొత్తరూల్.. అలా వస్తే నో దర్శనం..


గ్రామాల్లోకి ఏనుగులు రాగానే ప్రజలు ముందుగా ఫారెస్టు సిబ్బందికిసమాచారం ఇస్తుంటారు. కొందరు బాంబులు, టపాకాయలు, గిన్నెల చప్పుళ్లు చెప్పి ఏనుగులను భయంకలిగించే విధంగా చేస్తుంటారు. ఇదిలా ఉండగా.. బందీపూర్ ప్రాంతంలో ఒక ఏనుగు ఆహారం తినలేక తీవ్ర ఇబ్బందులు పడుతుంది. మే 8 న గుండ్లు పేట తాలుకా హిరికెరెలో ఏనుగు పట్టుపడింది. అప్పటి నుంచి ఏనుగు ఆహారం తినలేక తీవ్ర ఇబ్బందులు పడుతుంది.


వెంటనే గ్రామస్థులు ఫారెస్టు సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారి దానికి మత్తు పదార్థంను ఇచ్చారు. ఆ తర్వాత ఏనుగు ఉన్నసమస్యపై ఏంటని నిశితంగా పరిశీలించారు. అప్పుడు ఏనుగు నోటిలో దంతపు సమస్య వల్ల అది ఆహారం తినలేకపోతుందని గమనించారు. ఆ తర్వాత ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ సిబ్బంది కలసి ఏనుగుకు పెరుగుతున్న దంతం ను తీసేశారు. ఆ తర్వాత అది నార్మల్ గా అన్నిరకాల పదార్థాలను తినడనం ప్రారంభించింది.


Read more: Akshay Kumar: 56 ఏళ్ల వయసులో తొలిసారి ఓటు వేసిన హీరో అక్షయ్ కుమార్.. కారణం ఏంటో తెలుసా..?


దీంతో అధికారులు మరో ఏనుగు మావాటి వాడి సహాయంతో ఏనుగును తిరిగి దాని అడవి ప్రాంతంలో వదిలేశారు.  ఏనుగును లారీలో తీసుకెళ్లి దాన్ని ఎక్కడి నుంచైతే తీసుకుని వచ్చారో.. అక్కడికి తిరిగే వదిలేశారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏనుగు బాధను తీర్చినందుకు నెటిజన్లు, ఫారెస్టు సిబ్బందిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. నోరులేని జంతువు బాధను గుర్తించినందుకు అటవీ సిబ్బందికి ధన్యవాదాలు అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter