Huge Rush in Sabarimala: శబరిమల వద్ద భక్తుల రద్దీ అదుపులోకి వచ్చింది. గత మూడు రోజులుగా శబరిమలలో భక్తుల రద్దీ విపరీతంగా ఉండడంతో స్వామివారి దర్శనానికి 14 గంటల పాటు వేచి ఉండాల్సి వచ్చేది. దీంతో ఆలయ తంత్రి దేవస్వం బోర్డు అధికారుల సూచన మేరకు.. శబరిమలలో భక్తుల దర్శన సమయాన్ని నిన్నటి నుంచి గంటపాటు పొడిగించారు. అంతేకాకుండా 18వ మెట్టు ఎక్కే భక్తులను త్వరితగతిన పంపించేందుకు చర్యలు చేపట్టామని.. దీంతో దర్శనం సమయం 14 గంటల నుంచి నాలుగు గంటలకు తగ్గిందని అధికారులు పేర్కొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సన్నిధానం ప్రాంతంలో భక్తుల రద్దీని అదుపులోకి తెచ్చినప్పటికీ, ఎరిమెలి నిలక్కల్‌తో సహా మిగతా ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ కొనసాగుతోంది. పంబ లో కొనసాగుతున్న ఆచరణాత్మక సమస్యల కారణంగా.. రద్దీని నియంత్రించడానికి మరియు భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారులు వీలైనంత త్వరగా పంబ నుండి సన్నిధానం పంపేలా చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా పంబలో చిన్నపిల్లలు, వృద్ధులు, అంగవైకల్యం ఉన్నవారిని గుర్తించి పంబ నుంచి స్వామిమలై మీదుగా సన్నిధానం పంపేలా అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.


మరోవైపు అయ్యప్ప ఆలయానికి భక్తులు, మాలధారుల తాకిడి పెరిగింది. రోజూ వర్చువల్ క్యూ ద్వారా 90 వేల బుకింగ్స్, 30 వేల స్పాట్ బుకింగ్స్ జరుగుతున్నాయని ఓ ఆలయ అధికారి తెలిపారు. చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు అధిక సంఖ్యలో వస్తున్న కారణంగా దర్శనానికి ఎక్కువ సమయం పడుతుందని ఆయన అన్నారు. అయ్యప్పను దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భారీగా భక్తులు శబరిమలకు తరలి వస్తున్నారు. దీంతో వారి కోసం ట్రావెన్ కోర్ దేవస్థానం అన్ని ఏర్పాట్లును చేస్తోంది. అంతేకాకుండా  క్యూలో వేచి ఉండే భక్తులకు మంచి నీరు, బిస్కెట్లను అందిస్తున్నట్లు బోర్డు తెలిపింది.


Also Read: Sabarimala Pilgrim Rush: శబరిమల భక్తులకు గుడ్‌న్యూస్.. దర్శన సమయం పెంపు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి