Sabarimala Darshan Timings: శబరిమల దర్శన సమయాన్ని గంటపాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. శబరిమల వద్ద రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. భారీ సంఖ్యలో భక్తులు రావడంతో దర్శన సమయాలను పొడిగించేందుకు శబరిమల తంత్రి అనుమతి ఇచ్చారు. స్వామి వారి దర్శనం కోసం భక్తులకు 14 గంటల పాటు సమయం పడుతోంది. శబరిమల అయ్యప్ప ఆలయంలో భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకుని పోలీసులను జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భక్తులు దాదాపు 14 గంటలకు పైగా క్యూలైన్లలో నిల్చుని భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకున్నారు. కాగా.. క్యూ కాంప్లెక్స్‌లో సౌకర్యాలు లేవని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తుండడంతో వర్చువల్ క్యూ బుకింగ్‌ను రోజుకు 90 వేల నుంచి 80 వేలకు తగ్గించాలని అధికారులు నిర్ణయించారు. మంత్రి కె.రాధాకృష్ణన్, ట్రావెన్‌కోర్ దేవస్వామ్ బోర్డు (టీడీబీ) ప్రెసిడెంట్ పిఎస్ ప్రశాంత్‌తో శనివారం జరిగిన సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ముందుగా నిర్దేశించిన ప్రదేశాలలో స్పాట్ బుకింగ్ కేంద్రాలు యథావిధిగా పనిచేస్తాయని అధికారులు తెలిపారు. దర్శన సమయాలను రోజూ 17 గంటలకు మించి పొడిగించడం సాధ్యం కాదని టీడీబీ పేర్కొంది. ఆలయ సమయాలను పొడిగించడం కష్టమని శబరిమల తంత్రి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని బోర్డు శనివారం హైకోర్టుకు నివేదించింది. భక్తుల రద్దీ నేపథ్యంలో జస్టిస్ అనిల్ కే నరేంద్రన్, జస్టిస్ పీజీ అజిత్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది.
శుక్రవారం ఉదయం నుంచి కొండ పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని పతనంతిట్ట ఎస్పీ అజిత్ తెలిపారు. మొత్తం 92,364 మంది యాత్రికులు శుక్రవారం ఆలయాన్ని సందర్శించారని చెప్పారు. గురువారం 85,400 మంది దర్శించుకోగా.. శనివారం 90 వేల ఆన్‌లైన్ బుకింగ్స్, 21 వేల స్పాట్ బుకింగ్‌లు జరిగాయన్నారు. రోజుకు 90 వేల మంది యాత్రికుల దర్శించుకోవాలంటే.. ఒక గంటలో 18 పవిత్ర మెట్లను అధిరోహించడానికి 4,600 మంది యాత్రికులను అనుమతించాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పవిత్ర మెట్ల ద్వారా గంటకు 3,500 మంది యాత్రికులను అనుమతిస్తుమన్నామని తెలిపారు.
పిల్లలు, వృద్ధులు, వికలాంగ యాత్రికులు పవిత్ర మెట్లు ఎక్కేటప్పుడు వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉండడంతో సమయం పడుతోందన్నారు. గర్భగుడి భక్తుల కోసం తెల్లవారుజామున 3 గంటలకు తెరుచుకుంటుందని.. మధ్యాహ్నం 1 గంటకు మూసివేస్తున్నామని టీడీబీ అధ్యక్షుడు తెలిపారు. తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనం ఉంటుందన్నారు. మళ్లీ దర్శన సమయం పెంచితే ఆలయ ప్రధాన అర్చకులు, సహాయ అర్చకులు, ఇతర ఉద్యోగులకు నిర్వీరామంగా పని చేయాల్సి ఉంటుంది.
Also Read: WPL 2024 Auction: మల్లికా సాగర్ ఎవరు..? WPL ఆక్షనీర్ ఎందుకంత స్పెషల్..?
Also Read: Tata Tiago Price: రూ. 5.60 లక్షలకే 26.49కిమీ మైలేజీ ఇచ్చే టాటా టియాగో..పూర్తి వివరాలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Sabarimala Pilgrim Rush: శబరిమల భక్తులకు గుడ్‌న్యూస్.. దర్శన సమయం పెంపు