న్యూ ఢిల్లీ: బీజేపి జాతీయ నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. తెలంగాణకు చెందిన డీకే అరుణ ( Dk Aruna ), ఏపీకి చెందిన దగ్గుబాటి పురంధేశ్వరికి ( Daggubati Purandeswari ) జాతీయ పార్టీ కార్యవర్గంలో కీలక పదవులు దక్కాయి. డికె అరుణను పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమించిన బీజేపి.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను దగ్గుబాటి పురందేశ్వరికి అప్పగించింది. తెలంగాణలో పార్టీకి ఇదివరకు పార్టీ అధ్యక్షుడిగా సేవలు అందించిన లక్ష్మణ్‌ను ( Lakshman ) బీజేపి ఓబీసీ విభాగం జాతీయ అధ్యక్షుడిగా నియమించింది. అలాగే ఏపీ నుంచి సత్యకుమార్‌కి ( Satyakumar ) కార్యదర్శులలో జాబితాలో చోటు కల్పించింది. ఇప్పటివరకు పార్టీ ప్రధాన కార్యదర్శులుగా కొనసాగిన రామ్ మాధవ్ ( Ram Madhav ), పి మురళీధర్ రావు ( Muralidhar Rao ), అనిల్ జైన్, సరోజ్ పాండేల స్థానంలో కొత్త వారికి చోటు కల్పించింది. Also read : Bihar polls: ముంబై నుంచి బీహార్‌కు సమస్యలు పార్శిల్: శివసేన నేత సంజయ్ రౌత్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బెంగళూరు నుంచి లోక్ సభకు ఎన్నికైన యువ ఎంపీ తేజస్వి సూర్యను పార్టీ యువి విభాగం భారతీయ జనతా పార్టీ యువ మోర్చ అధ్యక్షుడిగా ( MP Tejaswi Surya as president of BJYM) నియమించింది. ఇప్పటివరకు బీజేవైఎం జాతీయ అధ్యక్షురాలి స్థానంలో కొనసాగిన పూనం మహజన్‌ను ఆ స్థానం నుంచి తొలగించారు. జేపీ నడ్డా ( JP Nadda ) పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన 8 నెలల అనంతరం ఎంపికైన ఈ నూతన కార్యవర్గంలో మొత్తం 23 మందికి చోటు లభించింది. 


పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా ఎంపికైన వారిలో రమణ్ సింగ్, ముకుల్ రాయ్, బైజయంత్ జే పాండా, డికె అరుణ తదితరులు ఉన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. Also read : Mumbai Drugs case: విచారణకు హాజరైన ప్రముఖ హీరోయిన్లు


ఇప్పటివరకు బీజేవైఎం అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించిన పూనం మహజన్ ( Poonam Mahajan ) పార్టీ తీసుకున్న నిర్ణయంపై స్పందిస్తూ.. గత నాలుగేళ్ల పాటు బీజేవైఎం అధ్యక్షురాలిగా పార్టీకీ సేవ చేసే భాగ్యం కల్పించినందుకు తాను చాలా సంతోషంగా అనిపించిందని.. అందుకు పార్టీ అధినాయకత్వం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డాలకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని ట్విటర్ ద్వారా ప్రకటించారు.



ప్రస్తుతం పూనం మహజన్ ముంబై నార్త్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. Also read : SPB cremated with full state honors: ప్రభుత్వ లాంఛనాలతో బాలు అంత్యక్రియలు పూర్తి