March GST: దేశంలో జీఎస్టీ వసూళ్లు అదుర్స్ కనిపిస్తున్నాయి. మార్చి నెలలో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదైయ్యాయి. గతేడాది ఇదే నెలలతో పోలిస్తే 15 శాతం వృద్ధి చెందింది. రూ.1.42 లక్షల కోట్లుగా నమోదు అయ్యాయి. ఫ్రిబవరిలో నమోదైన రూ.1.33 లక్షల కోట్లతో పోలిస్తే 6.8 శాతం పెరిగాయి.  మార్చి నెలకు గానూ రూ.1,42, 095 కోట్ల జీఎస్టీ వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఇందులో కేంద్ర జీఎస్టీ రూ.25,830 కోట్లు కాగా..రాష్ట్రాల జీఎస్టీ రూ.32,378 కోట్లుగా ఉంది. సమ్మిళిత జీఎస్టీ కింద రూ.74,470 కోట్లు, సెస్ రూపంలో రూ.9,389 కోట్లు వసూలు అయ్యాయి. ఈమేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతేడాది మార్చితో పోలిస్తే ఈసారి జీఎస్టీ వసూళ్లు 15 శాతం, 2020లో ఇదే నెలతో పోలిస్తే 46 శాతం పెరిగాయి. ఇప్పటివరకు ఈఏడాది జనవరి నెలలో జీఎస్టీ వసూళ్లు గరిష్ఠంగా ఉన్నాయి. జనవరి నెల రూ.1.40 లక్షల కోట్లు వసూలైయ్యాయి. వరుసగా తొమ్మిదో నెలా వసూళ్లు రూ.లక్షల కోట్లు దాటాయి. మొత్తం 2021-22 ఆర్థిక ఏడాదిలో జీఎస్టీ వసూళ్లు రూ.14.83 లక్షల కోట్లు నమోదైయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం వసూలైన రూ.11.37లక్షల కోట్లతో పోలిస్తే 30 శాతం అధికంగా ఉందని ఆర్థిక శాఖ వెల్లడించింది. 


ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణతోపాటు పన్ను ఎగవేత నిరోధక చర్యలు ఫలిస్తుండటంతో వసూళ్లు పెరిగాయి. రేట్ల హేతుబద్దీకరణ కూడా అందుకు దోహదం చేస్తోందని ఆర్థిక శాఖ తెలిపింది. 


Also Read: Harnaz Kaur Sandhu: షాకింగ్ విషయం బయటపెట్టిన మిస్ యూనివర్స్... ఆమెకు అరుదైన వ్యాధి...


Also Read: Rashmika Mandanna: ఊహించని షాక్.. రష్మికను సైడ్ చేసిన విజయ్?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook