మీరు ఏటిఎం కార్డు వాడుతున్నారా, లేక డెబిట్ కార్డా.. అదేంటి రెండూ ఒకటే కదా అని మీ అనుమానం. కానీ (ATM Card Vs Debit Card) ఏటీఎం కార్డు వేరు, డెబిట్ కార్డు వేరని కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ తదితర బ్యాంకులు ఏటీఎం, డెబిట్ రెండు రకాల కార్డులను జారీ చేస్తున్నాయి. కేవలం నాలుగు అంకెల పిన్ కోడ్ సాయంతో ఏటీఎం కార్డు వాడి నగుదు డ్రా చేసుకోవచ్చు. అదే డెబిట్ కార్డు విషయానికొస్తే నగదు డ్రా చేయడంతో పాటు రెస్టారెంట్లు, స్టోర్స్, షాపింగ్ మాల్స్‌లో బిల్లులూ చెల్లించవచ్చు. ఆన్‌లైన్ చెల్లింపులు సాధ్యపడుతుంది. వీటి మధ్య అసలు వ్యత్యాసం తెలియాలంటే ఈ వివరాలు చదవండి.  జీతం నుంచి డబుల్ PF కట్ అవుతుందా.. EPFO రూల్స్‌లో ఏముంది?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏటీఎం కార్డులు (ATM Cards) 


  • ఏటీఎం కార్డుతో కేవలం ఏటీఎంలలో నగదు డ్రా చేసుకునే వీలుంది.

  • ఏటీఎం కార్డులకు నాలుగు అంకెలతో కూడిన పిన్ నెంబర్ ఉంటుంది. బ్యాంకు సిబ్బంది వినియోగదారుల ఖాతాకు పిన్ వివరాలు లింక్ చేస్తారు. 

  • ఏటీఎంలో, బ్యాంకులో నగదు విత్ డ్రా చేయగానే బ్యాంకు బ్యాలెన్స్ తక్షణమే ఆప్‌డేటెడ్‌ అవుతుంది.

  • ఏటీఎం కార్డులకు ఏ విధమైన వడ్డీ (Interest) వసూలు చేయరు.

  • ఈ కార్డులను ఎక్కడపడితే అక్కడ బిల్లులు చెల్లింపులు, ఇతరత్రా అవసరాలకు వినియోగించే సౌకర్యం లేదు.

  • ఇతర బ్యాంకు ఏటీఎంలలో నగదు ఉపసంహరిస్తే.. ఏటీఎం ఛార్జీలు అధికంగా వసూలు చేస్తారు.

  • మీ అకౌంట్‌లో బ్యాంకులు నిర్దేశించిన నగదు లేని పక్షంలో ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని వినిగియోంచుకోవడం వీలుకాదు.  EPFO కొత్త రూల్.. పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త..


డెబిట్ కార్డులు (Debit Cards)


  • డెబిట్ కార్డులను చాలా తేలికగా, సులభంగా వినియోగించవచ్చు.

  • ఎక్కడైనా, ఎప్పుడైనా డెబిట్ కార్డు సౌకర్యాన్ని వాడుకోవడం వీలవుతుంది.

  • అయితే కార్డును నేరుగా వాడకుండా చేసే చెల్లింపులలో డెబిట్ కార్డు పిన్ నెంబర్ ఉంటే చాలు.

  • డెబిట్ కార్డుల వివరాలు బ్యాంకు ఖాతాకు అనుసంధానమై ఉంటాయి. ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తే తక్షణమే అప్‌డేట్ అయిన నగదు వివరాలు కనిపిస్తాయి.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos


Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ


బుల్లితెర భామ టాప్ Bikini Photos