EPFO కొత్త రూల్.. పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త..

తాజాగా సవరించిన నియమం ప్రకారం ప్రతి పీఎఫ్ ఖాతాదారుడి కుటుంబానికి ఈడీఎల్ఐ నగదు అందజేయాలని ట్రస్టీస్ నిర్ణయం తీసుకున్నారు.

Last Updated : Mar 16, 2020, 08:02 AM IST
EPFO కొత్త రూల్.. పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త..

న్యూడిల్లీ: (Provident Fund) పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) PF ఖాతాదారుల కోసం ఓ రూల్‌ను సవరించింది. ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) ఇప్పడు అందరికీ అందనుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఇటీవల ఈ నిర్ణయం తీసుకుంది. సవరించిన రూల్ ప్రకారం.. సర్వీస్‌లో ఉన్న ఏ ఉద్యోగి చనిపోయినా ఈడీఎల్ఐ బెనిఫిట్‌ను ఉద్యోగి కుటుంబంలోని నామినీకి ఇన్సూరెన్స్ నగదును అందజేస్తారు.

నేటి నుంచి ఆ కార్డులపై సర్వీసులు రద్దు

ఓ కంపెనీలో కచ్చితంగా ఏడాదికి పైగా పనిచేయకపోయినా నామినీ ద్వారా ఆ ఉద్యోగి కుటుంబానికి నగదు అందుతుంది. గతంలో ఉన్న రూల్ ప్రకారం.. ఉద్యోగి మరణించడానికి ముందు ఆ కంపెనీలో వరుసగా ఏడాది పనిచేస్తేనే ఆ ఇన్సూరెన్స్ డిపాజిట్ సొమ్ము ఇచ్చేవారు. తాజాగా సవరించిన నియమం ప్రకారం ప్రతి పీఎఫ్ ఖాతాదారుడి కుటుంబానికి ఈడీఎల్ఐ నగదు అందజేయాలని ట్రస్టీస్ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ప్రైవేట్ సంస్థల పీఎఫ్ ఖాదారుల కుటుంబాకు దీని వల్ల ప్రయోజనం చేకూరనుంది.

జీతం నుంచి డబుల్ PF కట్ అవుతుందా.. EPFO రూల్స్‌లో ఏముంది?

సర్వీస్‌లో ఉన్న ఉద్యోగి చనిపోతే ఆ పీఎఫ్ ఖాతాదారుల కుటంబానికి మినిమమ్ అస్యూరెన్స్ బెనిఫిట్ కింద రూ.2.5 లక్షలు అందజేయాలని ప్రతిపాదించారు. గరిష్టంగా అయితే మ్యాగ్జిమమ్ అస్యూరెన్స్ కింద రూ.6లక్షలు ఆ ఉద్యోగి కుటుంబసభ్యులకు అందజేయనున్నట్లు కేంద్ర కార్మికశాఖ తెలిపింది. దీని కోసం పీఎఫ్ ఖాతాదారులు ఎలాంటి ప్రీమియం చెల్లించనక్కర్లేదు.

See Photos: అందమైన భామలు.. లేత మెరుపు తీగలు

ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ (EPS)పెన్షనర్ల విషయానికొస్తే.. వీరు పెన్షన్ పొందాలనుకుంటే లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లోనే ఈ సర్టిఫికెట్‌ను సబ్మిట్ చేయవచ్చునని ఈపీఎఫ్ఓ సూచించింది. గతంలో అయితే లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేసేందుకు నిర్ణీత గడువు ఉండేది. కానీ తాజా సవరణలతో పెన్షనర్లు ఏడాదిలో ఎప్పుడైనా సరే తమ లైఫ్ సర్టిఫికెట్‌ను అందజేయవచ్చు. దీనివల్ల 64 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది.

Also Read: శుభవార్త.. ఉద్యోగులకు ఆ కష్టం ఉండదు

Also Read: 30 రోజుల్లో జాబ్ రాకపోతే.. 75 శాతం పీఎఫ్ విత్‌డ్రా 

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News