నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత, జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. "దేశాన్ని ఇంకెన్ని ముక్కలు చేయాలని అనుకుంటున్నారు. ఏ ఒక ముక్క (పాక్) సృష్టించారు. చాలదా?. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం చూస్తుంటే.. దేశంలో మరిన్ని మతకల్లోలాలు రెచ్చగొట్టేలా ఉంది" అని తీవ్రంగా ధ్వజమెత్తారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శనివారం జమ్మూలో జరిగిన ఒక ర్యాలీలో ఆయన మాట్లాడుతూ - "ఇప్పటికే మీరు ఒక ముక్కను (పాకిస్థాన్) సృష్టించారు. ఇంకా దేశంలో ఎన్ని ముక్కలు సృష్టిస్తారు" అని అన్నారు. "నేను పీవోకే పాకిస్థాన్ దే అని అన్నాను. పాకిస్థాన్ వాళ్లు చేతులకేమైనా గాజులు తొడుక్కున్నారా? వాళ్ల వద్ద అణుబాంబులు ఉన్నాయి. మీరూ మీరూ గొడవలు చూసుకుంటారు... యుద్ధాలు చేస్తారు. పోయేవి మా ప్రాణాలు' అని ఫరూఖ్ గతవారం చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. 


ఎక్కడో ఢిల్లీలో ప్యాలెస్ లో ఉండటం కాదు.. సరిహద్దుల్లో జీవిస్తున్నపేదోళ్ల గురించి ఆలోచించండి. రోజూ బాంబు దాడులతో ప్రాణాలు అరచేతబట్టుకొని బతుకు జీవుడా..! అని నివసిస్తున్న వారి ఆర్తనాదాలు పట్టించుకోండి. అవేవీ మీకు పట్టవా? అని ఘాటుగా స్పందించారు.