Dr Ashok Seth feels Coronavirus third wave hits in India: దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ (Coronavirus) కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ (Omicron).. నెమ్మదిగా ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. భారత్‌ (India)లో కూడా రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే దేశంలో కేసుల సంఖ్య 73కు చేరింది. పిల్లలు సైతం కొత్త వేరియంట్‌ కాటుకు గురవుతున్నారు. మొన్నటివరకు మారణహోమం సృష్టించిన కరోనా డెల్టా వేరియంట్‌ కంటే ఒమిక్రాన్‌ శరవేగంతో వ్యాప్తి చెందే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. భారతదేశంలో రోజురోజుకు పెరుగుతున్న ఓమిక్రాన్ కేసుల నేపథ్యంలో థర్డ్ వేవ్ తప్పదు అని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ ఛైర్మన్ డాక్టర్ అశోక్ సేథ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బూస్టర్ డోస్ (Booster Dose) సిద్దం చేసుకోవాలి సూచించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓ జాతీయ మీడియాతో డాక్టర్ అశోక్ సేథ్ (Dr Ashok Seth) మాట్లాడుతూ... 'మనం నిజంగా ప్రమాదంలో ఉన్నాము. కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్.. ఓ అంటువ్యాధిలా వేగంగా విస్తరిస్తుంది. థర్డ్ వేవ్ తప్పకపోవచ్చు. అనారోగ్యం తీవ్రత అనేది ఓ మనిషి శరీరం రోగనిరోధక శక్తి ప్రతిస్పందనకు సంబంధించినది. భారతదేశం చాలా పెద్ద దేశం కాబట్టి.. వైరస్ ఒక్కసారి అటాక్ అయితే చాలా మంది ఆసుపత్రిలో చేరే అవకాశం ఉంటుంది. బూస్టర్ డోస్‌లు కరోనాకి వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ప్రభుత్వం బూస్టర్ డోస్ సిద్దం చేసుకోవాలి' అని అన్నారు. 


Also Read: Pat Cummins: చివరి నిమిషంలో పాట్‌ కమిన్స్‌ అవుట్‌.. స్టీవ్‌ స్మిత్‌కే మళ్లీ సారథ్య బాధ్యతలు!!


ఓమిక్రాన్ (Omicron) వేరియంట్ డెల్టా కంటే వేగంగా వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మంగళవారం హెచ్చరించిన విషయం తెలిసిందే. 77 దేశాలలో ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. ఇక భారత దేశంలో కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉండగా.. ఒమిక్రాన్ కలవరపెడుతోంది. ఇది రోజురోజుకు పలు రాష్ట్రాలకు వ్యాపిస్తోంది. తాజాగా 7 వేల మందికి కరోనా సోకగా.. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 73కి చేరింది. మహారాష్ట్రలో అత్యధికంగా 32 మంది కొత్త వేరియంట్‌ బారినపడ్డారు. బుధవారం 12,16,011 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 7,974 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఇప్పటి వరకు 3.47 కోట్ల మంది మహమ్మారి బారిన పడగా.. వారిలో 3.41 కోట్ల మంది కోలుకున్నారు. 476,478 మంది ప్రాణాలు కోల్పోయారు. బుధవారం 60 లక్షల మందికి పైగా టీకా వేయించుకోగా.. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 135 కోట్ల మార్కును దాటింది.


Also Read: Minimum Age For Marriage: అమ్మాయిల కనీస వివాహ వయసు 18 ఏళ్ల నుంచి 21కి పెంపు..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి