Pat Cummins: చివరి నిమిషంలో పాట్‌ కమిన్స్‌ అవుట్‌.. స్టీవ్‌ స్మిత్‌కే మళ్లీ సారథ్య బాధ్యతలు!!

ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్ అడిలైడ్‌ టెస్ట్ నుంచి తప్పుకున్నాడు. కమిన్స్ ‌స్థానంలో ఆసీస్ మాజీ సారథి స్టీవ్‌ స్మిత్‌ మళ్లీ బాధ్యతలు చేపట్టాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 16, 2021, 12:27 PM IST
  • అడిలైడ్‌ టెస్ట్ నుంచి తప్పుకున్న ప్యాట్‌ కమిన్స్
  • చివరి నిమిషంలో పాట్‌ కమిన్స్‌ అవుట్‌
  • స్టీవ్‌ స్మిత్‌కే మళ్లీ సారథ్య బాధ్యతలు
 Pat Cummins: చివరి నిమిషంలో పాట్‌ కమిన్స్‌ అవుట్‌.. స్టీవ్‌ స్మిత్‌కే మళ్లీ సారథ్య బాధ్యతలు!!

Pat Cummins ruled out of Adelaide Test due to Coronavirus scare: ప్రతిష్టాత్మక యాషెస్‌ 2021 సిరీస్‌ (Ashes 2021)లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా (Australia vs England) జట్ల మధ్య రెండో టెస్టు అడిలైడ్‌ (Adelaide Test) వేదికగా ఈరోజు ప్రారంభం అయింది. అయితే ఈ టెస్టుకు ముందు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో ఊహించని పరిణామం ఒకటి చోటుచేసుకుంది. టెస్ట్ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్ (Pat Cummins) అడిలైడ్‌ టెస్ట్ నుంచి తప్పుకున్నాడు. కమిన్స్ ‌స్థానంలో ఆసీస్ మాజీ సారథి స్టీవ్‌ స్మిత్‌ మళ్లీ బాధ్యతలు చేపట్టాడు. ట్రావిస్ హెడ్ అడిలైడ్ టెస్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ విషయాన్ని క్రికెట్‌ ఆస్ట్రేలియా (CA) తమ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇక కమిన్స్ స్థానంలో మైఖేల్‌ నెసర్‌ (Michael Neser) జట్టులోకి వచ్చాడు. దాంతో యాషెస్‌లో నెసర్‌ అరంగేట్రం చేశాడు. 

అడిలైడ్‌ టెస్టుకు ముందు (బుధవారం సాయంత్రం) డిన్నర్‌ కోసం ఆసీస్ టెస్ట్ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్ (Pat Cummins) అడిలైడ్‌లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లాడు. అక్కడ కరోనా వైరస్ పాజిటివ్‌ వ్యక్తికి సన్నిహితంగా మెలిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కమిన్స్ జట్టు నుంచి వైదొలిగాడు. ప్రస్తుతం కమిన్స్‌ ఐసోలేషన్‌లో ఉన్నాడు. ఏడు రోజుల పాటు అతడు ఐసోలేషన్‌లోనే ఉంటాడని దక్షిణ ఆస్ట్రేలియా ఆరోగ్య విభాగం ధృవీకరించింది. దాంతో స్టీవ్ స్మిత్‌ మరోసారి సారథ్య బాధ్యతలు చేపట్టాడు. కమిన్స్‌ RT-PCR పరీక్ష చేయించుకోగా.. నెగటివ్ రిపోర్ట్ వచ్చిందట. మెల్‌బోర్న్‌లో జరిగే బాక్సింగ్ డే టెస్టుకు కమిన్స్ అందుబాటులో ఉంటాడని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తోంది.

Also Read: Pragathi Dance: అమ్మో.. ప్రగతి మళ్లీ రచ్చచేసిందిగా! నాగిని డ్యాన్స్‌తో అందాల ఆరబోత మాములుగా లేదు!!

అడిలైడ్‌ వేదికగా ఈ రోజు ఆరంభం అయిన టెస్టులో టాస్‌ (Toss) గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. బోజనవిరామ సమయానికి ఆసీస్ ఒక వికెట్ కోల్పోయింది. 25 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 45 పరుగులు చేసింది. ఓపెనర్ మార్కస్ హారిస్ (3) పూర్తిగా నిరాశపరిచాడు. 28 బంతులు ఆడి 3 పరుగులు చేసి క్యాచ్ ఔట్ అయ్యాడు. డేవిడ్ వార్నర్ (20), మార్నస్ లబుషేన్ (16) క్రీజులో ఉన్నారు. స్టువర్ట్ బ్రాడ్ ఒక వికెట్ పడగొట్టాడు. తొలి మ్యాచ్‌లో విజయం సాధించి ఆతిథ్య ఆసీస్‌ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.

Also Read: Minimum Age For Marriage: అమ్మాయిల కనీస వివాహ వయసు 18 ఏళ్ల నుంచి 21కి పెంపు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News