Drone Flying Over PM Modis Residence: న్యూఢిల్లీలోని ప్రధాని నరేంద్రమోదీ నివాసంపై ఓ డ్రోన్‌ ఎగరడం కలకలం రేపుతోంది. హై సెక్యూరిటీ, నో ఫ్లై జోన్‌లో ఉన్న ప్రధాని నివాసంపై డ్రోన్‌ ఎగురవేయడంపై చర్చనీయాంశంగా మారింది. సోమవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో పీఎం మోదీ నివాసంపై ఏదో ఏదో ఎగురుతున్నట్లు చూసి ఒక వ్యక్తి కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు. భద్రతా సిబ్బంది, పోలీసులు అప్రమత్తమై వెంటనే పరిశీలించగా.. ఎలాంటి వస్తువులు కనిపించలేదు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎస్‌పీజీ దర్యాప్తు ప్రారంభించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రధానమంత్రి నివాసం లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ఉంది. ఈ ప్రాంతం మొత్తం నో ఫ్లయింగ్ జోన్‌లోకి వస్తుంది. ఇలాంటి ప్రాంతంలో డ్రోన్ ఎగరడంంతో పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. విచారణ సందర్భంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) సహకారం కూడా తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. 


"న్యూ ఢిల్లీ డిస్ట్రిక్ట్ నియంత్రణ గదికి ప్రధానమంత్రి నివాసానికి సమీపంలో గుర్తుతెలియని ఎగిరే వస్తువు గురించి సమాచారం అందింది. పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించాం. కానీ అలాంటి వస్తువు కనిపించలేదు. ఈ విషయంపై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌ను కూడా సంప్రదించాం. వారు కూడా ప్రధాని నివాసానికి సమీపంలో అలాంటి ఎగిరే వస్తువును ఉన్నట్లు నిర్ధారించలేదు.." అని ఢిల్లీ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. 


సోమవారం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో ఓ అనుమానాస్పద డ్రోన్‌ ప్రధాని నివాసంపై సంచరించినట్లు ఎస్పీజీ (స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌) నుంచి తమకు సమాచారం అందిందని చెప్పారు. కాగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసం వద్ద కూడా ఓ అనుమానాస్పద డ్రోన్ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ ఇల్లు కూడా నో ఫ్లై జోన్‌లోనే ఉంది.


Also Read: Maharashtra Politics: మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం.. 29 మంది ఎమ్మెల్యేలతో జంప్


Also Read: Maharashtra Politics: మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన అజిత్ పవార్ ఆస్తుల విలువ ఎంతంటే..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook