Moderna Vaccine: కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి దేశ ప్రజలకు గుడ్‌న్యూస్. త్వరలో మరో అంతర్జాతీయ వ్యాక్సిన్ అందుబాటులో రానుంది. దేశంలోని మరో ప్రముఖ కంపెనీ ఈ వ్యాక్సిన్‌ను మార్కెట్ చేయనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో కరోనా వ్యాక్సినేషన్(Corona Vaccination) ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. మేకిన్ ఇండియా వ్యాక్సిన్ కోవాగ్జిన్, సీరమ్ ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్, రష్యాకు చెందిన స్పుట్నిక్ వి వ్యాక్లిన్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. త్వరలో క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుని జైడస్ క్యాడిలా వ్యాక్సిన్ మార్కెట్‌లో రానుంది. వ్యాక్సిన్ కొరతను తీర్చేందుకు మరిన్ని వ్యాక్సిన్లు అందుబాటులో రావల్సిన అవసరముంది. ఈ నేపధ్యంలో ప్రముఖ అంతర్జాతీయ వ్యాక్సిన్‌కు సంబంధించి శుభవార్త అందుతోంది.


అమెరికాకు చెందిన మోడెర్నా(Moderna)కంపెనీ అభివృద్ది చేసిన కోవిడ్ వ్యాక్సిన్ త్వరలో ఇండియాలో అందుబాటులో రానుంది. ఈ వ్యాక్సిన్ మార్కెటింగ్ బాధ్యతల్ని ఇండియన్ మల్టీ నేషనల్ కంపెనీ సిప్లా చేపట్టనుంది. దీనికి సంబంధించి సిప్లా (Cipla) కంపెనీ డీసీజీఐ అనుమతిని ఇవ్వనుంది. ఇవాళ దీనికి సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. డీసీజీఐ అనుమతి లభించింది.ఇప్పటికే మోడెర్నా వ్యాక్సిన్ అనుమతి కోసం డీసీజీఐకు(DCGI) సిప్లా దరఖాస్తు చేసుకుంది. రెండు డోసుల ఈ వ్యాక్సిన్ 90 శాతం సమర్ధత కలిగి ఉండగా..కెనడా, అమెరికా, బ్రిటన్ దేశాల్లో ఆమోదం పొందింది. ఈ దేశాల్లో ఇప్పటికే వ్యాక్సినేషన్ జరుగుతోంది. మోడెర్నా వ్యాక్సిన్ (Moderna Vaccine)అందుబాటులో వస్తే..వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కానుంది.


Also read: FIR on Twitter: ట్విట్టర్‌పై ఉత్తరప్రదేశ్‌లో ఎఫ్ఐఆర్ నమోదు, తప్పుడు మ్యాప్ ఫలితం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook