Vaccination Dry run: దేశ చరిత్రలో అతిపెద్ద కార్యక్రమం త్వరలో ప్రారంభం కానుంది. వ్యాక్సిన్ పంపిణీకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఏర్పాట్లలో భాగంగా దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ డ్రై రన్ జరగనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ప్రపంచమంతా ఎదురుచూసిన కరోనా వ్యాక్సిన్ ( Corona vaccine ) వచ్చేసింది. ఆ వ్యాక్సిన్ పంపిణీ ( Vaccine Distribution )కు ఇప్పుడు భారతదేశం సిద్ధమైంది. భారతదేశ చరిత్రలో ఇదొక అతి పెద్ద వ్యాక్సినేషన్ ( India's biggest vaccination ) ప్రక్రియ కానుండటంతో అధికారులు పూర్తిగా అప్రమత్తమవుతున్నారు. ఎక్కడా ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఒకటికి పదిసార్లు పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగానే కీలకమైన డ్రై రన్‌ను చేపట్టారు.


డ్రై రన్ అంటే..


భారీ ఎత్తున ఓ కార్యక్రమం చేపట్టబోయే ముందు ముందస్తు జాగ్రత్తగా చేసే ప్రక్రియను డ్రై రన్ ( Dry run ) అంటారు వ్యాక్సినేషన్ డ్రై రన్ అంటే నామమాత్రపు అంటే డమ్మీ వ్యాక్సినేషన్ ప్రక్రియ. టీకా పంపిణీకి అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేయడం, లోపాల్ని గుర్తించే ప్రయత్నంలో భాగంగానే డ్రై రన్ నిర్వహిస్తారు. ఇందులో డమ్మీ వ్యాక్సిన్ ( Dummy vaccine ) ఇస్తారు.


దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో డ్రై రన్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ ( Andhr pradesh ), గుజరాత్ ( Gujarat ), అస్సోం ( Assom ), పంజాబ్ ( Punjab ) రాష్ట్రాల్లో డ్రై రన్ రెండ్రోజులపాటు అంటే డిసెంబర్ 28 , 29 తేదీల్లో జరుగుతుంది.  ఒక్కో రాష్ట్రంలో రెండు జిల్లాల్లో ఈ డ్రై రన్ ఉంటుంది. డ్రై రన్‌లో పలు కీలకదశల్ని పరిశీలిస్తారు. ప్రతి జిల్లాలో వంద మందికి అవసరమైన టీకాను సమీపంలోని వ్యాక్సినేషన్ కేంద్రానికి తీసుకొస్తారు. 


వ్యాక్సిన్ తీసుకునే వ్యక్తికి ఎస్ఎంఎస్ పంపిస్తారు. వ్యాక్సిన్ ఇచ్చే అధికారి పేరు, సమయం వివరాలు ఆ మెస్సేజ్‌లో ఉంటాయి. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత ఓ అరగంట సేపు అక్కడే కూర్చుని ఉండాలి. సైడ్ ఎఫెక్ట్స్  ఏమైనా కన్పిస్తే వెంటనే చికిత్స అందిస్తారు. ఆ సమచారాన్ని సెంట్రల్ సర్వర్ ద్వారా కేంద్రానికి పంపిస్తారు. 


Also read: Driver less train: ఇవాళ దేశపు తొలి డ్రైవర్ రహిత ట్రైన్ ప్రారంభం