Driver less train: భారతదేశపు తొలి డ్రైవర్ రహిత రైలు ఇవాళ పట్టాలెక్కనుంది. ఢిల్లీ మెట్రో మరో అరుదైన ఘనతను సాధించనుంది. దేశపు తొలి డ్రైవర్ రహిత ట్రైన్ సర్వీసును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.
డ్రైవర్ లేకుండా నడిచే ట్రైన్లు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 7 శాతం మాత్రమే ఉన్నాయి. ఇండియాలో ఇప్పుడు తొలిసారి డ్రైవర్ రహిత ట్రైన్ సర్వీసు ( India's first driverless train service ) ప్రారంభం కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 7 శాతం డ్రైవర్ రహిత ట్రైన్ సర్వీసుల్లో ఇండియా చేరనుంది. ముఖ్యంగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ( Delhi metro rail corporation ) ఆ ఘనతను దక్కించుకోనుంది. దేశపు తొలి డ్రైవర్ రహిత ట్రైన్ సర్వీసును ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 28న ప్రారంభించనున్నారు.
మానవ తప్పిదాల్ని తగ్గించడమే కాకుండా..మెరుగైన ప్రయాణ సౌకర్యం, రవాణా రంగంలో కొత్త శకం సాధ్యమవుతాయని అధికారులు చెబుతున్నారు. ఉదయం 11 గంటలకు ఢిల్లీ మెట్రోలోని మెజెంటా లైన్ ( Magenta line ) ( జనక్‌పురి వెస్ట్-బొటానికల్ గార్డెన్ ) లో డ్రైవర్ రహిత రైలు సర్వీసు ప్రారంభం కానుంది. దీంతోపాటు ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్‌లో పూర్తిస్థాయిలో పని చేసే నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ సేవను వీడియా కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ ( Pm Narendra modi ) ప్రారంభించనున్నారు.
మెజెంటా లైన్‌లో డ్రైవర్‌లెస్ సర్వీసులు ప్రారంభమైన తరువాత..2021 మధ్యనాటికి ఢిల్లీ మెట్రోలోని 57 కిలోమీటర్ల పింక్ లైన్‌లో కూడా ఈ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. తొలిదశను మెజెంటా లైన్‌తో ప్రారంభిస్తున్నారు.
Also read: Travel Allowance: టీఏ రీయింబర్స్‌మెంట్ గుడ్‌న్యూస్..ఎలాగో తెలుసా..