Dust storm in Delhi | న్యూ ఢిల్లీ: భారీ ఉష్ణోగ్రతలతో భగభగ మండుతున్న ఢిల్లీ వాతావరణం బుధవారం సాయంత్రం కురిసిన జల్లులతో ఒక్కసారిగా చల్లబడింది. అయితే, అంతకంటే ముందుగా ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ ప్రాంత పరిసరాల్లో ( Delhi-NCR) దుమ్ము తుఫాన్ విరుచుకుపడింది. దుమ్ము తుఫాను వెంటే ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కుండపోతగా కురిసింది. 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచాయి. వర్షం కురిసింది కొద్దిసేపే అయినా.. ఢిల్లీ వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఈ భారీ వర్షం కారణంగా ఢిల్లీ-నొయిడాను అనుసంధానం చేసే డిఎన్డీ ఫ్లై ఓవర్‌పై వాహనాలు 4 కిమీ నిలిచిపోయాయి. Heavy rains: మూడు, నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు )


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"186534","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ఢిల్లీలో జూన్ 15 నుంచి వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటాయని.. వర్షాలు (Rains) కూడా కురిసే అవకాశం ఉండటంతో కనిష్టంగా 26 డిగ్రీల సెల్సియస్, గరిష్టంగా 35 డిగ్రీల సెల్సియస్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. జూన్ 27 నాటికి నైరుతి రుతుపవనాలు ఢిల్లీని తాకుతాయని (Monsoon to hit Delhi) వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..