Delhi earthquake: ఢిల్లీలో మళ్లీ భూకంపం.. వణికిస్తున్న వరుస భూకంపాలు
Earthquake hits Delhi ఢిల్లీ, నొయిడా, ఎన్సీఆర్ పరిసర ప్రాంతాల్లో బుధవారం రాత్రి 3.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ( NCS ) వెల్లడించిన వివరాల ప్రకారం ` రాత్రి 10:42 గంటలకు నొయిడాకు 19 కిలోమీటర్ల ఆగ్నేయంలో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై భూకంపం తీవ్రత 3.2 గా నమోదైంది`. అందుబాటులో ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఎటువంటి ప్రాణనష్టం లేదా పెద్ద ఆస్తి నష్టం జరగలేదనే తెలుస్తోంది.
న్యూ ఢిల్లీ: Earthquake hits Delhi ఢిల్లీ, నొయిడా, ఎన్సీఆర్ పరిసర ప్రాంతాల్లో బుధవారం రాత్రి 3.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ( NCS ) వెల్లడించిన వివరాల ప్రకారం " రాత్రి 10:42 గంటలకు నొయిడాకు 19 కిలోమీటర్ల ఆగ్నేయంలో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై భూకంపం తీవ్రత 3.2 గా నమోదైంది". అందుబాటులో ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఎటువంటి ప్రాణనష్టం లేదా పెద్ద ఆస్తి నష్టం జరగలేదనే తెలుస్తోంది. ( Cyclone Nisarga: తీరాన్ని తాకిన నిసర్గ తుఫాన్.. అల్లకల్లోలంగా మారిన సముద్రం )
మే 29 న సైతం రాత్రి 9.08 గంటలకు ఢిల్లీ, నొయిడా, ఎన్సీఆర్ ప్రాంతంతో పాటు హర్యానాలోనూ ఓసారి భూమి కంపించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.6 గా నమోదైంది. హర్యానాలోని రోహ్తక్‌లో భూకంప కేంద్రం ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.
కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్, లాక్‌డౌన్ ( COVID-19, Lockdown ) లాంటి సమస్యలు ఓ వైపు వేధిస్తుండగానే మరోవైపు తరచుగా సంభవిస్తున్న భూకంపాలు ఢిల్లీ వాసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
అయితే, ఇదే విషయమై జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలోని భూగర్భ శాస్త్ర ప్రొఫెసర్ డాక్టర్ సౌమిత్రా ముఖర్జీ మాట్లాడుతూ.. ప్రతీ సంవత్సరం ఈ ప్రకంపనలు సంభవిస్తున్నందున దాని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు'' అని అన్నారు. అయితే, భూకంపం సంభవించిన ప్రతీసారి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరమైతే ఉందని అన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..