Earthquake: భారతదేశ సముద్రభాగమైన అండమాన్‌లో భూకంపం సంభవించింది మద్యాహ్నం 2 గంటల 21 నిమిషాలకు సంభవించిన ఈ భూకంపం..సునామీ భయాందోళనలు రేపింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియాలో తరచూ కొన్ని ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఇవాళ మద్యాహ్నం 2 గంటల 21 నిమిషాలకు అండమాన్ సముద్రంలో భారీ భూకంపమే సంభవించింది రిక్టర్ స్కేలుపై 4.6 తీవ్రత నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. అండమాన్ నికోబార్ రాజధాని నగరం పోర్ట్‌బ్లెయిర్ సమీపంలో సముద్రంలో 40 కిలోమీటర్ల లోతులోనే 4.6 తీవ్రతతో భూకంపం రావడంతో..సునామీ అవకాశాలున్నాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు అనుమానిస్తున్నారు. 


అటు ఆప్ఘనిస్తాన్‌లోని హిందూకుష్ పర్వత శ్రేణి ప్రాంతంలో కూడా నిన్న భూకంపం సంభవించింది. ఇంకోవైపు ఇవాళ టోంగా దీవుల్లో వరుసగా 5.9, 6.2 తీవ్రతతో రెండు భూకంపాలు సంభవించాయి. అండమాన్‌లో సంభవించిన భూకంపం కారణంగా ప్రాణ, ఆస్థినష్టం వివరాలు తెలియలేదు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీవరకూ 81 భూకంపాలు సంభవిస్తే..అందులో 73 ఇండియా, పొరుగుదేశాల్లోనే సంభవించాయి. హర్యానాలోని రోహ్‌తక్, ఒడిశాలోని గంజాం, కర్ణాటకలోని బీజాపూర్, చిక్‌బళ్లాపూర్, ఏపీలోని నెల్లూరు, కేరళలోని కొల్లాం, తమిళనాడులోని దిండిగల్‌లో చిన్నగా భూమి కంపించినట్టు తెలిసింది.



Also read: Cop's Daughter Raped: దారుణం... పోలీస్ కూతురిపై బాయ్‌ఫ్రెండ్ హత్యాచారం...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook