మనీ లాండరింగ్ ( Money laundering ) అనుమానంపై బాలీవుడ్ నటి రియా చక్రవర్తికి ( Rhea Chakraborty ) ఈడీ సమన్లు జారీ చేసింది. ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ నటుడు సుశాంత్ సింహ్ రాజ్ పుత్ డబ్బుల్ని వ్యక్తిగతంగా వినియోగించుకోవడం, మనీలాండరింగ్ ఆరోపణలపై ఆమెను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


బాలీవుడ్ నటుడు సుశాంత్ సింహ్ రాజ్ పుత్ ( Sushant singh Rajput death case ) మరణం కేసులో కొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సుశాంత్ డబ్బుల్ని వ్యక్తిగత అవసరాలకు వాడుకోవడమే కాకుండా మనీ లాండరింగ్ ( Money laundering ) కు పాల్పడిందన్న ఆరోపణలపై విచారించేందుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ( Enforcement Directorate ) రంగంలో దిగింది. ఆగస్టు 17న విచారణకు హాజరుకావల్సిందిగా రియా చక్రవర్తికి సమన్లు పంపింది. ముంబాయి ( Mumbai ) లోని రెండు ఆస్థుల్లో రియా పెట్టిన పెట్టుబడికి నిధులు సుశాంత్  సింహ్ రాజ్ పుత్ ఎక్కౌంట్ నుంచి వచ్చాయా...లేదా మరెక్కడి నుంచి వచ్చాయనే కోణంపై ఈడీ విచారించనుంది. ఇప్పటికే రియా ఛార్టెడ్ అక్కౌంటెంట్ సందీప్ శ్రీధర్ ను విచారించింది. ఆ తరువాతే రియాకు సమన్లు పంపింది.


సుశాంత్ తండ్రి కేకే సింహ్ ( Sushant father Kk singh )..జూలై 28 న రియా, ఆమె కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేశారు. నేరపూరిత కుట్ర, మోసం చేసిందని ఆరోపించారు. షార్ట్ టైమ్ లో సుశాంత్ అక్కౌంట్ నుంచి రియా 15 కోట్ల రూపాయలు విత్ డ్రా చేసిందని కూడా ఆరోపించారుAlso read: ‘సుశాంత్‌ను సెలబ్రిటీ చేసింది ముంబై.. బిహార్ జోక్యమెందుకు’