Edible oil companies have slashed edible oil prices by up to rs 30-40 centre told companies give immediate benefits to customers : కొత్త ఏడాది సందర్భంగా ఒక గుడ్‌ న్యూస్ వచ్చింది. దిగుమతి సుంకాలను తగ్గించడం వల్ల వంట నూనెల ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. క్రమంగా వంట నూనెల ధరలు మరింత తగ్గుతాయని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే (Sudhanshu Pandey) తెలిపారు. రబీలో ఆవాల దిగుబడి మెరుగ్గా ఉండడనుండడంతో వంట నూనెల ధరలు (edible oil prices) మరింత తగ్గనున్నాయని తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక రాష్ట్ర ప్రభుత్వాలు (State Governments) తమ రాష్ట్రాల్లో వంటనూనెను ఎంఆర్పీపీకే (MRP) అమ్మేలా చూడాలని సుధాంశు పాండే కోరారు. ఇందుకోసం తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.


గత నెల రోజులుగా వంట నూనెల ధరలు తగ్గుతున్నట్లు పాండే  పేర్కొన్నారు. వంటనూనెలపై దిగుమతి సుంకాన్ని దాదాపు సున్నాకి తగ్గించినట్లు పాండే (Pandey) తెలిపారు. ఇక ట్యాక్స్‌లపై  కేంద్రం కల్పించిన ప్రయోజనాన్ని కంపెనీలు కస్టమర్లకు బదిలీ చేయాలంటూ కేంద్ర ఆహార శాఖ సూచించింది. దీంతో ప్రధాన వంట నూనెల బ్రాండ్‌ కంపెనీలు (Edible oil brand‌ companies) 15 శాతం నుంచి 25 శాతం దాకా ధరలు తగ్గించాయి. ఫలితంగా రూ. 30 నుంచి 40 రూపాయల వరకు వంట నూనెల ధరలు తగ్గాయి. ఇక మరికొన్ని రోజుల్లో ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉంది.


ఈ ఏడాది మొదటి నుంచి వంట నూనెల ధరలు పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం వంట నూనెల ధరలు కాస్త తగ్గాయి. ఈ ధరలు మరింత తగ్గనున్నాయి. పండగల (Festivals) సమయంలో ఇలా వంట నూనెల ధరలు క్రమంగా తగ్గుతుండడంతో సామాన్యులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 


Also Read : Todays Gold Rate : తెలుగు రాష్ట్రాలు సహా దేశీయ మార్కెట్‌లో నేటి బంగారం ధరల వివరాలు


వంట నూనెల ధర తగ్గింపును వినియోగదారులకు వెంటనే అందేలా చూడాలని  కేంద్రం కంపెనీలను ఆదేశించింది. వంట నూనెల ప్యాకెట్లు లేదా బాటిల్స్, క్యాన్స్, కంటైనర్‌లపై తగ్గించిన ఎంఆర్పీ (MRP) ముద్రించాలని అన్ని వంట నూనెల (edible oil) బ్రాండ్లకు సూచించింది.


Also Read : Horoscope Today, 31 December 2021 : ఆ రాశి వారికి స్నేహితుడే ద్రోహిగా మారే ఛాన్స్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook