Eknath Shinde: మహారాష్ట్రలో బలపరీక్షకు వేళాయే..షిండే మెజార్టీ లాంఛనం కానుందా..!
Eknath Shinde: మహారాష్ట్రలో అనేక నాటకీయ పరిణామాల మధ్య శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. ఇక బలపరీక్ష ఎదుర్కోవాల్సి ఉంది.
Eknath Shinde: మహారాష్ట్రలో అనేక నాటకీయ పరిణామాల మధ్య శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. బీజేపీ-శివసేన రెబెల్స్ వర్గం కలిపి మహారాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. ఇక అసెంబ్లీలో బలం నిరూపించుకోవాల్సి సమయం వచ్చేసింది. ఈనెల 4న అసెంబ్లీలో బల పరీక్ష జరగనుంది. కొత్త సీఎం ఏక్‌నాథ్ షిండే తన మెజార్టీని నిరూపించుకోనున్నారు.
అసెంబ్లీలో ఏక్‌నాథ్ షిండేకు మెజార్టీ లాంఛనంగా కనిపిస్తోంది. శివసేనకు చెందిన 49 మంది రెబెల్స్ ఎమ్మెల్యేల సంపూర్ణ మద్దతు ఉంది. మరోవైపు బీజేపీ సైతం అండగా ఉంటోంది. ప్రస్తుతం ఆ పార్టీకి 106 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. బీజేపీ, రెబెల్స్ ఎమ్మెల్యేలు, స్వతంత్ర అభ్యర్థులు ఏక్‌నాథ్ వైపే ఉండటంతో శాసనసభలో బలపరీక్షను షిండే సులువుగానే అధికమిస్తారని విశ్లేషకులు చెబుతున్నారు. షిండే వర్గం సైతం అదే ధీమాతో ఉంది.
సభలో బల నిరూపణ పూర్తైన వెంటనే కేబినెట్ కూర్పుపై దృష్టి పెట్టనున్నారు. రెబల్స్ ఎమ్మెల్యేలకు దాదాపుగా మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎంగా ఫడ్నవీస్ ఇప్పటికే ప్రమాణస్వీకారం చేశారు. ఆ పార్టీ నుంచి మరికొంత మందిని కేబినెట్‌లోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈనెల 2,3 తేదీల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీకి స్పీకర్ పదవికి బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ నర్వేకర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. జూలై 3న ఎన్నిక జరిగే అవకాశం కనిపిస్తోంది.
Also read: TRS vs BJP: హైదరాబాద్‌లో పోటా పోటీ ఫ్లెక్సీలు..బీజేపీకి కౌంటర్‌గా భారీ హోర్డింగ్‌లు..!
Also read: Actress Meena: ఇకనైనా అసత్య ప్రచారం ఆపండి..భర్త మరణంపై నటి మీనా భావోద్వేగ లేఖ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook