Sharad Pawar New Party Name: శరద్ పవార్ కొత్త పార్టీకి ఎలక్షన్ కమిషన్ ఆమోదం తెలిపింది. తాజాగా కొత్త పార్టీ పేరును ఈసీ ఫిక్స్ చేసింది. దీనికి 'ఎన్సీపీ శరద్ చంద్రపవార్' (Nationalist Congress Party-Sharadchandra Pawar) పార్టీగా నామకరణం చేసింది. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. మంగళవారం రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ కు కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది. ఆయన మేనల్లుడు అజిత్ పవార్ నేతృత్వంలోని వర్గాన్నే అసలైన ఎన్సీపీగా గుర్తిస్తూ.. గడియారం గుర్తును ఆ వర్గానికే కేటాయించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత కొన్ని రోజులుగా మహారాష్ట్ర ఎన్సీపీ ఎవరిదనే విషయంలో రగడ అవుతోంది. పార్టీలో చీలికలు వచ్చి కుమ్ములాటలు జరుగుతున్నాయి. దీంతో ఎన్నికల సంఘం.. ఎన్సీపీ  అజిత్ పవార్ వర్గానిదే అని ప్రకటించింది. ప్రస్తుతం ఎన్సీపీకి 53 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కొన్నాళ్లుగా పార్టీపై పట్టును కోల్పోతూ వస్తున్న శరద్ పవార్ కు కేవలం 12 మంది ఎమ్మెల్యేల సపోర్టు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. 


Also Read: Uttarakhand Assembly: ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ఆమోదించిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్!


గతేడాది ఎన్సీపీ నుంచి చీలిపోయి మెజార్టీ ఎమ్మెల్యేలతో కలిసి అజిత్ పవార్ బీజేపీ సర్కారు కుమద్దతు పలికాడు. దీంతో అజిత్ కు డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చింది షిండే సర్కారు. అంతేకాకుండా ఆయన వర్గంలోని కొంత మంది ఎమ్మెల్యేలు మంత్రులు కూడా అయ్యారు. అప్పటి నుంచే ఎన్సీపీ ఎవరదనే విషయంలో కుమ్ములాటలు జరుగుతున్నాయి. 


Also Read: ISRO Recruitment 2024: పది పాసైనవారికి బంపర్ ఆఫర్.. ఇస్రోలో జాబ్స్.. రూ.80,000 జీతం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి