EPFO Bans Paytm: పేటీఎం లావాదేవీల్ని నిషేధించిన ఈపీఎఫ్ఓ, బ్యాంక్ ఎక్కౌంట్ ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయడం ఎలా
EPFO Bans Paytm: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షల తరువాత పేటీఎంకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పుడు ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సైతం పేటీఏం పేమెంట్స్ బ్యాంక్‌పై నిషేధం విధించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
EPFO Bans Paytm: ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ పేటీఎం విషయంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పేటీఎం పేమెంట్ బ్యాంక్ లావాదేవీలపై నిషేధం విధిస్తూ ఇందుకు సంబంధించిన మార్గదర్శకాల్ని జారీ చేసింది.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్బీఐ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 29 వరకూ ఉన్న గడువును తాజాగా ఆర్బీఐ మార్చ్ 15 వరకూ పొడిగించింది. ఆర్బీఐ ఆంక్షల ప్రభావం పేటీఎంపై స్పష్టంగా కన్పిస్తోంది. తాజాగా పేటీఎం లావాదేవీలపై ఈపీఎఫ్ఓ సంస్థ నిషేధం విధించింది. ఈ నిషేధం ఫిబ్రవరి 23 నుంచి అమల్లో రానుంది. పేటీఎం పేమెంట్ బ్యాంక్‌లో ఎక్కౌంట్ కలిగిన ఖాతాదారులకు నగదు విత్‌డ్రా, క్రెడిట్ లావాదేవీలపై ఈ నిషేధం ప్రభావం చూపించవచ్చు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ బ్యాంకింగ్ సేవల్ని నిలిపివేయాలంటూ ఆర్బీఐ ఆదేశించిన నేపధ్యంలో ఈపీఎఫ్ఓ ఈ నిర్ణయం తీసుకుంది.
ఈపీఎఫ్ఓ ఖాతాదారులు తమ బ్యాంక్ ఎక్కౌంట్ వివరాలు తక్షణం అప్‌డేట్ చేసుకోవాలి. ఒకవేళ పేటీఎం పేమెంట్ బ్యాంక్ ఎక్కౌంట్ కలిగి ఉంటే మార్చుకుని ఆ వివరాలు ఈపీఎఫ్ఓ కార్యాలయానికి సమర్పించాలి. ఈపీఎఫ్ ఎక్కౌంట్ వివరాల్ని ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.
ముందుగా ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్ లాగిన్ అయి యూజర్ నేమ్, పాస్‌వర్డ్ నమోదు చేయాలి. ఆ తరువాత మేనేజ్ ఆప్షన్ ఎంచుకోవాలి. అందులోంచి కేవైసీ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్ టైప్ చేయాలి. ఇందులో బ్యాంక్ ఎక్కౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్‌సి వివరాలు సరిగ్గా ఎంటర్ చేసి సేవ్ చేయాలి. సేవ్ చేసిన తరువాత మీ వివరాలు స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతాయి. డాక్యుమెంట్ ప్రూఫ్ ఎంప్లాయర్‌కు సబ్మిట్ చేయాలి. సంబంధిత సంస్థతో వెరిఫికేషన్ తరువాత స్టేటస్ డిజిటల్లీ ఎప్రూవ్డ్ కేవైసీ అని కన్పిస్తుంది. అదే సమయంలో మీ మొబైల్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది.
Also read: Paytm FAQs and Answers: పేటీఎంపై మీ సందేహాలు ప్రశ్నలకు ఆర్బీఐ సమాధానాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook