EPFO E Nomination: మీ పీఎఫ్ ఖాతాలో ఇ నామినేషన్ దాఖలు చేశారా లేదా
EPFO E Nomination:ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్..నుంచి కీలకమైన అప్‌డేట్ వెలువడింది. మార్చ్ 31వ తేదీలోగా ఈ నామినేషన్ తప్పకుండా చేయాల్సిందిగా సూచిస్తోంది.లేకపోతే ఖాతా నిలిచిపోయే అవకాశముందని హెచ్చరిస్తోంది.
EPFO E Nomination:ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్..నుంచి కీలకమైన అప్‌డేట్ వెలువడింది. మార్చ్ 31వ తేదీలోగా ఈ నామినేషన్ తప్పకుండా చేయాల్సిందిగా సూచిస్తోంది.లేకపోతే ఖాతా నిలిచిపోయే అవకాశముందని హెచ్చరిస్తోంది.
ఈపీఎఫ్‌వోకు సంబంధించి ఈ నామినేషన్ పూర్తి చేశారా..లేకపోతే వెంటనే చేయండి. మార్చ్ 31వ తేదీ చివరితేదీ. ఇప్పటికే రెండుసార్లు ఈ నామినేషన్ గడువు పొడిగించింది సంస్థ. ఈసారి పొడిగించే అవకాశం లేదంటోంది. గడువు తేదీలోగా ఈపీఎఫ్‌ఓ నామినేషన్ చేయకపోతే..పలు ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుందని ఈపీఎఫ్ఓ చెబుతోంది. ఖాతా నిలిచిపోయే అవకాశముందంటున్నారు. ఈ నామినేషన్ ఎలా దాఖలు చేయాలి, లేకపోతే ఎదురయ్యే సమస్యలేంటో తెలుసుకుందాం..
ఈపీఎఫ్‌వో నామినేషన్ దాఖలు చేయకపోతే..పీఎఫ్ బ్యాలెన్స్ స్థంబించే అవకాశముంది. గతంలో ఇ నామినేషన్ అవసరం లేకపోయినా..ఇప్పుడు తప్పనిసరిగా మారింది. మీ పీఎఫ్ ఖాతాలో కుటుంబంలోని ఎవరో ఒకరిని నామినీగా చేర్చాల్సి ఉంటుంది నామినీ దాఖలు చేయకపోతే..ఖాతాదారుడు చనిపోతే..ఈపీఎఫ్‌లో డిపాజిట్ చేసిన డబ్బులు నిలిచిపోతాయి. తిరిగి ఆ డబ్బులు పొందేందుకు కోర్టును ఆశ్రయించాల్సి వస్తుంది.
ఈపీఎఫ్‌లో ఇ నామినీ భర్తీ చేయకపోతే..పీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు విత్‌డ్రా చేయలేరు. పాస్‌బుక్ కూడా తెర్చుకోని పరిస్థితి ఉంటుంది. అందుకే మార్చ్ 31 లోగా తప్పనిసరిగా ఇ నామినేషన్ చేయాల్సి ఉంటుంది. మార్చ్ 31 తరువాత స్క్రీన్‌పై పాప్‌అప్ మెస్సేజ్ ద్వారా ఇ నామినేషన్ జరగలేదని సూచిస్తుంది. ఇ నామినేషన్ ఎలా చేయాలంటే..
ముందుగా epfindia.gov.in లాగిన్ కావల్సి ఉంటుంది. ఆ తరువాత సర్వీసెస్ ట్యాబ్ ఓపెన్ చేసి..డ్రాప్ డౌన్ మెనూలో ఉద్యోగుల కొరకు అనే ట్యాబ్ క్లిక్ చేయాలి. ఇప్పుడు లాగిన్ చేసేందుకు అవసరమైన మీ యూనివర్శల్ ఎక్కౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తరువాత మేనేజ్ మెంట్ ట్యాబ్ ద్వారా..ఇ నామినేషన్ క్లిక్ చేసి..మీ శాశ్వత, ప్రస్తుత చిరునామా ఎంటర్ చేయాలి. కుటుంబం కలిగి ఉన్నారా అనే ప్రశ్నకు అవుననే సమాధానం ఇచ్చి..నామినీ ఎంటర్ చేయాలి. ఆ తరువాత సేవ్ క్లిక్ చేసి..ప్రొసీడ్ ప్రెస్ చేయాలి. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు పంపించిన ఆధార్ నెంబర్ , ఓటీపీ ఎంటర్ చేయాలి. అంతే ఇ నామినేషన్ పూర్తవుతుంది.
Also read: Anti Conversion Bill: హర్యానాలో అమలులోకి వచ్చిన మత మార్పిడి నిరోధక చట్టం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook