Manmohan Singh Funeral: మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు మూడు రోజు జరగనున్నాయి. గురువారం రాత్రి కన్నుమూసిన ఆయన అంత్యక్రియలు శనివారం నిర్వహించనున్నారు. మాజీ ప్రధాని అంత్యక్రియలు ఎక్కడ? ఎప్పుడూ? ఏ సమయానికి అనే వివరాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Half Day Holiday: మాజీ ప్రధానికి సంతాపంగా రేపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒకపూట సెలవు


న్యూఢిల్లీలోని మోతీలాల్‌ నెహ్రూ రోడ్డులో ఉన్న మన్మోహన్‌ సింగ్‌ నివాసంలో భౌతికకాయం ఉంచడంతో అక్కడ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు నివాళులర్పించారు. శనివారం అంతిమ యాత్రను నిర్వహించనున్నారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉంచనున్నారు. పార్టీ సంప్రదాయాల ప్రకారం కాంగ్రెస్‌ నాయకులు నివాళులర్పించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అంతిమయాత్ర మొదలుకానుంది.


Also Read: Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కన్నుమూత.. భారతదేశం దిగ్భ్రాంతి


అంత్యక్రియలు ఎక్కడ?
మాజీ ప్రధాని మరణానంతరం న్యూఢిల్లీలో అంత్యక్రియలు జరపనున్నారు. ఢిల్లీలోని నిగమ్‌ బోధ్‌ ఘాట్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి. అనంతరం మాజీ ప్రధానికి 21 గన్ సెల్యూట్ చేయనున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను ప్రత్యేక భద్రతా ప్రోటోకాల్‌లతో చేయనున్నారు. ఈ అంత్యక్రియలు పూర్తి ప్రభుత్వ అధికారిక గౌరవాలతో జరపనున్నారు. అనంతరం ఆర్మీ బ్యాండ్, సాయుధ దళాల సిబ్బంది నివాళులర్పించనున్నారు.


ప్రత్యేక స్మారకం కోసం లేఖ
ఢిల్లీలోని మోతీలాల్‌ నెహ్రూ రోడ్డులోని మన్మోహన్‌ సింగ్‌ నివాసం నుంచి శనివారం ఉదయం 8 గంటలకు కాంగ్రెస్‌ పార్టీకి తరలించనున్నారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, అభిమానులు సందర్శించి నివాళులర్పించారు. 8.30 నుంచి 9.30 గంటల వరకు అక్కడే ఉంచనున్నారు. అనంతరం అక్కడ నుంచి నిగమ్‌ బోధ్‌ ఘాట్‌ వరకు అంతిమయాత్ర జరపనున్నారు. ఘాట్‌లో 11.15 నుంచి హోం శాఖ కార్యదర్శి మొదలు.. 11.42 గంటలకు ఆఖరును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చివరి నివాళులర్పించనున్నారు. అనంతరం అంత్యక్రియలు జరుగుతాయి. ప్రత్యేక స్మారకం కోసం స్థలం కేటాయించాలని ప్రధాని మోదీకి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.