Half Day Holiday: మాజీ ప్రధానికి సంతాపంగా రేపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒకపూట సెలవు

Half Day Holiday To Central Govt Offices And CPSUs Employees: మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మృతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒకపూట సెలవు ప్రకటించారు. అంత్యక్రియల నేపథ్యంలో శనివారం కేంద్ర కార్యాలయాలకు ఒక పూట సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Dec 27, 2024, 09:55 PM IST
Half Day Holiday: మాజీ ప్రధానికి సంతాపంగా రేపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒకపూట సెలవు

Half Day Holiday: మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ మృతికి సంతాపం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఒక రోజు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే మన్మోహన్‌ సింగ్‌ అంత్యక్రియలు జరుగుతుండడంతో కేంద్ర కార్యాలయాలు, సంస్థలకు అదనంగా మరో పూట సెలవు ప్రకటించింది. శనివారం రోజు ఒకపూట సెలవు ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read: Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కన్నుమూత.. భారతదేశం దిగ్భ్రాంతి

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం ఒకపూట సెలవు ఇస్తున్నట్లు ప్రకటించింది. దేశంలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ సెలవు వర్తించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అంత్యక్రియలు శనివారం జరగనుండడంతో అందరూ మన్మోహన్‌కు సంతాపం తెలిపేందుకు ఈ ఒకపూట సెలవు ప్రకటించినట్లు తెలుస్తోంది. కాగా మాజీ ప్రధాని మరణానికి ఇప్పటికే ఏడు రోజుల పాటు సంతాప దినాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా మన్మోహన్‌ సింగ్‌ మృతికితెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు ఒకరోజు సెలవు ప్రకటించిన సంగతి విధితమే.

Also Read: KCR Condolence: మాజీ సీఎం కేసీఆర్‌ సంతాపం.. మన్మోహన్‌ సింగ్‌తో కేసీఆర్‌ది విడదీయరాని బంధం

మన్మోహన్‌ సింగ్‌ మృతితో దేశవ్యాప్తంగా తీవ్ర విషాదం ఏర్పడింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మాజీ ప్రధాని మన్మోహన్‌కు ప్రజలతోపాటు రాజకీయ, సినీ, ఇతర రంగాల ప్రముఖులు నివాళులర్పించారు. రాజకీయ పార్టీలు పలుచోట్ల దీపాలు వెలిగించి అంజలి ఘటించాయి. మన్మోహన్‌ అంత్యక్రియలకు భారీ ఎత్తున ప్రజలు హాజరుకానున్నారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో.. మన్మోహన్‌ సింగ్‌ నివాసంలో ప్రజల సందర్శనార్థం కొద్దిసేపు భౌతికకాయం ఉంచనున్నారు. అనంతరం అంతిమయాత్ర చేపట్టి గాంధీ ఘాట్‌ సమీపంలో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అంత్యక్రియలు చేపట్టనున్నారు.

కేటీఆర్ బృందం హాజరు
అధికారికంగా మన్మోహన్‌ సింగ్‌ అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ రాజకీయ పార్టీల అగ్ర నాయకులు రానున్నారు. తెలంగాణ నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌తో కూడిన బృందం మాజీ ప్రధాని అంత్యక్రియల్లో పాల్గొననుంది. కేసీఆర్‌ ఆదేశాల మేరకు బీఆర్‌ఎస్‌ పార్టీ బృందం ఇప్పటికే ఢిల్లీ చేరుకుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News