Exit Polls 2022: దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. యూపీ మరోసారి యోగీకు, పంజాబ్‌లో కేజ్రీ..క్రేజ్, ఇంకొన్ని చోట్ల హంగ్ ఇలా ఊహించని పరిణామాలు ఎదురుకానున్నాయి. ఏ రాష్ట్రంలో ఎవరికెన్ని సీట్లు దక్కనున్నాయి..ఏ సర్వే ఏం చెబుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గోవాలో హంగ్


మినీ సార్వత్రికంలో విజేతలను ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఉత్తర్​ప్రదేశ్​లో మరోసారి అధికారం బీజేపీదేనని తేల్చాయి. మునుపటితో పోల్చితే సీట్లు తగ్గినప్పటికీ ఆ రాష్ట్రంలో కమలదళానికి మెజారిటీకి మించి సీట్లు వస్తాయని తెలుస్తోంది. పంజాబ్​లో ఆమ్ ఆద్మీ పార్టీకి సంపూర్ణ ఆధిక్యం దక్కనుందని పోల్స్ స్వష్టం చేశాయి. మణిపుర్​లో బీజేపీ అధికారం దక్కించుకునే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ విశ్లేషించాయి. ఉత్తరాఖండ్​లో హోరాహోరీగా ఉండనుంది. మరోవైపు, గోవాలో హంగ్ ఏర్పడే అవకాశం ఉందని పోల్స్ అంచనా వేశాయి.


యూపీ యోగీకే


ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందని పీపుల్స్‌ పల్స్‌ సర్వే అంచనా వేసింది. బీజేపీ, మిత్రపక్షాలతో కలిసి 220 నుంచి 240 వరకు సీట్లు సాధిస్తుందని పోస్ట్‌ పోల్‌ సర్వే తెలిపింది. సమాజ్‌వాదీ పార్టీ దాని మిత్రపక్షాలకు కలిపి 140 నుంచి 160 స్థానాలు వస్తాయని తెలిపింది. బహుజన సమాజ్‌వాదీ పార్టీ 12 నుంచి 18 సీట్లు గెలిచే అవకాశముంది. సమాజ్‌వాదీ పార్టీ మిత్రపక్షం ఆర్‌ఎల్‌డీ 8 నుంచి 12 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా కట్టింది. కాంగ్రెస్‌ పార్టీ 6 నుంచి 10 స్థానాలకు పరిమితం కానుంది. గత ఎన్నికల్లో పోలిస్తే ఈసారి బీజేపీ 90 సీట్లు కోల్పోయే అవకాశముందని సర్వేలో వెల్లడైంది. 2017 ఎన్నికల్లో బీజేపీ 312 స్థానాల్లో విజయం సాధించింది. సమాజ్ వాదీ పార్టీని మరోసారి ప్రతిపక్షంలోనే కూర్చునే అవకాశముంది. అయితే గతంతో పోలిస్తే దాని బలం 300 శాతం వరకు పెరుగుతుందని అంచనా. యూపీ ఎన్నికల్లో బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీలు హోరాహోరీ తలపడినట్టు కనబడుతున్నా.. క్షేత్రస్థాయిలో చూసుకుంటే బీఎస్‌పీ కూడా బలమైన ఉనికిని కలిగి ఉంది. 


యూపీలో పరిస్థితికి కారణం


తాజా ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ యోగి ఆదిత్యనాథ్‌ను గద్దె దించే మానసిక స్థితికి ఓటరుకు చేరుకోలేదని పీపుల్స్‌ పల్స్‌ సర్వే అంచనా వేసింది. ప్రభుత్వ పథకాల నుంచి లబ్ది పొందినవారు సానుకూలత వ్యక్తం కావడం, శాంతిభద్రత పరిరక్షణ, అవినీతి రహిత పాలన పట్ల యూపీ వాసులు సంతృప్తిగా ఉన్నట్టు కనబడుతోంది. మహిళా ఓటర్లు ఎక్కువగా బీజేపీ వైపు మొగ్గు చూపారని మరో అంచనా.  అయితే బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యం చేశారని, ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండరన్న వాదనలు సీఎం యోగికి కంటగింపుగా మారాయి. బీజేపీ, మిత్రపక్షాలకు కలిపి 38 శాతం ఓట్లు.. సమాజ్‌వాదీ పార్టీ కూటమికి 35 శాతం, బీఎస్‌పీకి 16 శాతం, కాంగ్రెస్‌ 7 శాతం, ఇతరులకు 4 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో వెల్లడైంది. అంచనా వేసిన కంటే 5 శాతం అటుఇటు ఉండొచ్చని పీపుల్స్‌ పల్స్‌ తెలిపింది. 


పంజాబ్‌లో కేజ్రీవాల్ క్రేజ్


పంజాబ్​లో ఆమ్ ఆద్మీ పార్టీకి సంపూర్ణ ఆధిక్యం దక్కనుందని పోల్స్ తెలిపాయి. మణిపుర్​లో బీజేపీ అధికారం దక్కించుకునే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ విశ్లేషించాయి. మరోవైపు, గోవాలో హంగ్ ఏర్పడే అవకాశం ఉందని పోల్స్ అంచనా వేశాయి. ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్​లో ప్రభంజనం సృష్టించనుందని ఎగ్జిట్ పోల్స్ ఘంటాపథంగా చెప్పాయి. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్.. కేజ్రీవాల్ పార్టీకే పట్టం కట్టాయి. 117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్​లో మెజారిటీకి 59 స్థానాలు అవసరం కాగా.. ఆప్ అంతకుముంచి సీట్లను గెలుచుకోనుందని పోల్స్ వెల్లడించాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్.. రెండో స్థానంలో ఉంది. బీజేపీకి కనిష్ఠంగా ఒకటి, గరిష్ఠంగా ఆరు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. 


ఉత్తరాఖండ్‌లో టఫ్ ఫైట్


హోరాహోరీగా సాగిన ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ మరోసారి గట్టెక్కేందుకు పరిస్థితులు అంత సులభంగా లేనట్టు ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు చెప్తున్నాయి. కాంగ్రెస్‌ గతంలో కంటే మరింత పుంజుకునే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఏబీపీ-సీఓటర్ అంచనాల ప్రకారం బీజేపీకి 26-32 స్థానాలు రానుండగా.. కాంగ్రెస్​కు 32 నుంచి 38 సీట్లు వచ్చే అవకాశం ఉంది. మెజారిటీకి 36 స్థానాలు అవసరం.టైమ్స్‌ నౌ- వీటో అంచనాల ప్రకారం ఉత్తరాఖండ్​లో బీజేపీకి 37 సీట్లు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ 31 సీట్లు గెలుచుకోనుంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 46.5 శాతం, కాంగ్రెస్‌ 33.5 శాతం ఓట్లు సాధించాయి. బీఎస్పీ 7 శాతం ఓట్లు సాధించాయి. తాజా ఎన్నికల్లో పోటీ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్‌ మధ్యే ఉన్నప్పటికీ ఈసారి ఆప్‌  కూడా రంగంలోకి దిగడంతో రసవత్తరంగా మారింది. ప్రస్తుత సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి బీజేపీని ఒడ్డున పడేస్తారా? లేక కాంగ్రెస్‌ కమలానికి షాకిస్తుందా తేలాలంటే మార్చి 10 వరకు వేచి చూడాల్సిందే..


అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై పార్టీల అభిప్రాయాలు మరోలా ఉన్నాయి. పంజాబ్ మినహాయించి మిగిలిన చోట్ల పూర్తి ఆధిక్యం కనబరుస్తామని బీజేపీ చెబుతోంది. అటు కాంగ్రెస్ ఈ సర్వే ఫలితాల్ని కొట్టి పారేస్తోంది. పంజాబ్ ఎప్పటికీ తమదేనని..యూపీ, ఉత్తరాఖండ్ లో కచ్చితంగా అధికారం చేపడతామని అంటోంది. అటు ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్కటే సర్వే ఫలితాలపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఢిల్లీకి తోడుగా పంజాబ్ కలిసి రావడం ఆనందింపచేస్తున్నట్టుంది.


Also read: UP Exit Poll Results 2022: ఉత్తరప్రదేశ్‌లో మళ్లీ బీజేపీదే హవా..! ఎగ్జిట్ పోల్ ఫలితాలివే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook