భోపాల్: కరోనా కష్టాల్లో ఉన్న ఓ కుటుంబం ఇల్లు గుల్లయ్యింది. ఈ విపత్కర పరిస్థితుల్ల అనేక రకాలుగా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. లాక్ డౌన్ సమయంలో కట్టుదిట్టమైన భద్రతలున్నప్పటికీ తరుచూ శాంతి భద్రతల సమస్యలు వస్తూనే ఉన్నాయి. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఓ కుటుంబం కరోనా బారిన పడి క్వారంటైన్ కు వెళ్లగా, ఇదే ఆసరగా తీసుకొని దొంగలు ఇల్లును గుల్ల చేశారు. కుటుంబంలోని ఓ వ్యక్తికి ఏప్రిల్ 6న కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆ కుటుంబాన్ని క్వారంటైన్ కు తరలించారు. వారు ఇంటికి వచ్చే లోపు దొంగలు ఇంట్లోని విలువైన వస్తువులను దోచేసుకున్నారు. ఏప్రిల్ 22న ఈ ఘటన జరిగినట్టు గుర్తించారు. మొత్తం 12 లక్షల రూపాయల విలువైన వస్తువులు చోరీకి గురైనట్టు తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read:  కిమ్ జాంగ్ ఉన్ సంచలన నిర్ణయం


క్వారంటైన్ పూర్తవగానే ఇద్దరు కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూడగా తలుపులు తెరిచి ఉండడంతో దొంగతనం జరిగినట్టు అర్థం చేసుకున్నామని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ఆరంభించామని పోలీసులు పేర్కొన్నారు. అయితే దర్యాప్తు సరిగా సాగడంలేదంటూ ఆ కుటుంబం సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు ట్వీట్ చేసింది. పోలీసులు మాత్రం తాము తీవ్రంగా కృషి చేస్తున్నామని, దర్యాప్తులో తీవ్ర నిర్లక్ష్యం కనబడుతోందని బాధితులు పేర్కొనగా, వారి వాదనలో నిజంలేదని పోలీసులు అన్నారు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే కుటుంబం క్వారంటైన్ నుంచి ఏప్రిల్ 26న ఇంటికి రాగా, ఆ తర్వాత వారిలో నలుగురికి కరోనా పాజిటివ్ రావడంతో మళ్లీ ఆసుపత్రికి పరిగెత్తారు.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..