Farmer protest: వ్యవసాయం చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన పెరుగుతోంది. దేశవ్యాప్తంగా రైతులకు సంఘీభావంగా మద్దతు పలుకుతున్నారు. తాజాగా ప్రముఖ బాక్సర్ ఒలింపిక్ విజేత విజేందర్ సింగ్ రైతులకు మద్దతు పలికారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కేంద్ర ప్రభుత్వం ( Central Government ) తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రాజధాని ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళన ఇంకా కొనసాగుతోంది. డిసెంబర్ 8వ తేదీన భారత్ బంద్ ( Bharat Bandh ) తలపెట్టారు. మరోవైపు రైతుల సమ్మెలకు మద్దతు పెరుగుతోంది. తాజాగా ప్రముఖ బాక్సర్, ఒలింపిక్ విజేత విజేందర్ సింగ్ ( Boxer vijender singh ) రైతుకు అండగా నిలుస్తున్నట్టు ప్రకటించారు.


కేంద్ర ప్రభుత్వం వ్యవసాయచట్టాల్ని వెనక్కి తీసుకోకపోతే..తనకిచ్చిన రాజీవ్ ఖేల్ రత్న అవార్డు ( Rajiv khel ratna award ) ను వెనక్కి ఇచ్చేస్తానని ప్రకటించి సంచలనం రేపాడు. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతుల్ని కలిసి సంఘీభావం ప్రకటించాడు. పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన పలువురు క్రీడాకారులు ఇప్పటికే రైతు సమ్మెకు మద్దతు పలికారు. అటు పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ సైతం రైతు ఆందోళనకు మద్దతుగా పద్మ విభూషణ్ అవార్డు ( padma vibhushan award )ను వెనక్కి ఇచ్చేస్తానని స్పష్టం చేశారు.


ఇక డిసెంబర్ 8న జరగనున్న భారత్ బంద్‌కు పూర్తి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే వివిధ రాష్ట్రాలు బంద్‌కు మద్దతు ప్రకటించాయి. మరోవైపు రైతు సంఘాలతో కేంద్రం జరిపిన చర్చలు సఫలం కాలేదు. మరోసారి రైతులతో చర్చించాలని కేంద్రం నిర్ణయించింది.


Also read: Farmer protests: చర్చలు మళ్లీ విఫలం.. 9న మరోసారి భేటీ