Farmers Protest Live Updates: న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల (Farm laws) కు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు, కేంద్రం మధ్య ఈ రోజు మధ్యాహ్నం 2గంటలకు మరోసారి చర్చలు జరగనున్నాయి. అంతకుముందు ఆరుసార్లు జరిగిన చర్చలు విఫలం అయిన నేపథ్యంలో ఏడోసారి భేటీపై ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ చర్చల్లో పరిష్కారం లభిస్తుందని, రైతుల ఆందోళన కూడా ముగిస్తుదని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి (Kailash Choudhary) ఆశాభావం వ్యక్తం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలాఉంటే.. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు ( Farmer Agitation ) చేస్తున్న ఆందోళన సోమవారంతో 40వ రోజుకు చేరింది. ఒకవైపు తీవ్రమైన చలిలో, మరోవైపు రెండురోజులుగా ఢిల్లీలో కురుస్తున్న వర్షం (Heavy Rain) లో కూడా రైతులు ఏమాత్రం వెనక్కుతగ్గకుండా నిరసనను కొనసాగిస్తున్నారు. ఢిల్లీ శివార్లలోని సింఘు, టిక్రీ, ఘాజీపూర్, చిల్లా, పల్వాల్ తదితర చోట్ల రైతులు గుడారాల్లో, టెంట్ల కింద తలదాచుకొని ఆందోళనను కొనసాగిస్తున్నారు. Also read: Farmer protests: రైతులందరూ ఆ లేఖను చదవాలి: ప్రధాని మోదీ



కేంద్ర ప్రభుత్వం (Central Government) తో ఈసారి జరిగే చర్చలు సఫలం కాకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని రైతులు ప్రకటించారు. ఈ మేరకు జనవరి 6న ట్రాక్టర్ల ర్యాలీ, జనవరి 26న ట్రాక్టర్లతో కిసాన్ రిపబ్లిక్ పరేడ్ నిర్వహిస్తామని రైతు సంఘాలు (Farmers Organizations) స్పష్టంచేశాయి. రైతులు మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తుండగా.. కేంద్రం సవరణలకు మొగ్గు చూపుతోంది. Also read: COVID-19 Vaccine: ప్రతీ భారతీయుడికి గర్వకారణం: ప్రధాని మోదీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook