Farmers Protests Live Updates | న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల (Farm laws) ను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు 42 రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. తీవ్రమైన చలి, వర్షంలో కూడా రైతులు వెనకడుగు వేయకుండా నిరసనను (Farmer Agitation) కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా గురువారం వేలాది ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ట్రాక్టర్‌ ర్యాలీ ఢిల్లీ సరిహద్దుల్లోని ఉదయం నుంచి అన్ని ప్రాంతాల్లో ప్రారంభమైంది. సింఘు, ఘాజీపూర్, కుండ్లి, పాల్వాల్ ఎక్స్‌ప్రెస్ హైవేపై (Delhi Borders) రైతులు ర్యాలీ కొనసాగుతోంది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రైతుల ట్రాక్టర్ ర్యాలీ నేపథ్యంలో ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో సాయుధ బలగాలను భారీగా మోహరించారు. పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అయితే తమ డిమాండ్లను అంగీకరించకపోతే నిరసనను మరింత తీవ్రతరం చేస్తామని రైతు సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఈ మేరకు జనవరి 26న కిసాన్ రిపపబ్లిక్ పరేడ్‌ నిర్వహిస్తామని  (Farmers Organizations) రైతు సంఘాలు ఇప్పటికే వెల్లడించాయి. Also read: Central Vista Project: నూతన పార్లమెంట్ భవనానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్



రైతులు, కేంద్రం  (Central Government) మధ్య ఇప్పటివరకు ఏడుసార్లు జరిగిన చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రేపు ఎనిమిదోసారి చర్చలు జరగనున్నాయి. అయితే రైతులు మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తుండగా.. కేంద్రం సవరణలకు మొగ్గు చూపుతోంది. Also Read: Sourav Ganguly: ఆసుపత్రి నుంచి దాదా డిశ్చార్జ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook