నిజాన్ని దాచిపెట్టాలని ప్రయత్నించాడు. పేరు మార్చాడు. కరోనా వైరస్ మహమ్మారి విషయంలో కరోనా గైడ్‌లైన్స్ కాదని...వైద్యవృత్తికే కళంకం తీసుకొచ్చాడు. భార్య శాంపిల్స్‌ను పనిమనిషి పేరుతో పంపి అడ్డంగా బుక్కయ్యాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


అతడిని వైద్యుడనే కంటే చదువుకున్న అజ్ఞాని అంటే మంచిదంటున్నారు అంతా. మధ్యప్రదేశ్‌కు చెందిన అభయ్ రాజన్ సింగ్ చేసింది వింటే ఇదే అభిప్రాయం కలుగుతుంది. అభయ్ రాజన్ సింహ్ సింగ్రౌలీలో ఉన్న ఖుటార్ హెల్త్ సెంటర్‌లో ప్రభుత్వ వైద్యుడిగా పని చేస్తున్నాడు. తన భార్యకు కరోనా వచ్చిందనే అనుమానం వచ్చింది. బయటి ప్రపంచానికి తెలియకూడదనే ఉద్దేశ్యంతో తన భార్య శాంపిల్స్‌ను ఇంట్లో పనిచేసే పనిమనిషి పేరుతో ల్యాబ్‌కు పంపించాడు. అడ్డంగా బుక్కవడంతో  పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. Also read: Covid 19: బాలీవుడ్‌లో కరోనా పాగా: అనుపమ్ ఇంట నలుగురికి కరోనా పాజిటివ్


ఖుటార్ హెల్త్ సెంటర్‌లో కరోనా వైద్య విధులు నిర్వహిస్తున్న అభయ్ రాజన్ సింగ్ ఇటీవల అంటే జూన్ 23వ తేదీన ఉత్తరప్రదేశ్‌లో జరిగిన బంధువుల పెళ్లికి కుటుంబసమేతంగా లీవ్ పెట్టకుండానే వెళ్లాడు. జూలై ఫస్ట్‌వీక్‌లో ఆ కుటుంబం తిరిగొచ్చాక..భార్యకు కరోనా వైరస్ లక్షణాలు కన్పించాయి. అనుమానమొచ్చింది. తీరా కోవిడ్19 నిర్ధారణ పరీక్షలు చేయించాక పాజిటివ్ అని తేలితే బయటపడుతుందనే భయంతో నిజం దాచే ప్రయత్నం చేశాడు. తన భార్య శాంపిల్స్‌ను ఇంట్లోని పనిమనిషి పేరుతో పంపించాడు ల్యాబ్‌కు.  రిపోర్ట్ పాజిటివ్‌గా రావడంతో ఆ పనిమనిషి పేరున్న అడ్రస్‌కు వైద్యాధికారులు, పోలీసులు చేరుకున్నారు. విషయం కాస్తా బయటపడింది. అభయ్‌తో పాటు కుటుంబసభ్యులకు సైతం పరీక్షలు నిర్వహించగా..పాజిటివ్ అని తేలింది. అందర్నీ క్వారెంటైన్ కు తరలించారు. Also read:Amitabh: నిలకడగా ఆరోగ్యం: జయాబచ్చన్‌కు నెగెటివ్, ఐశ్వర్యారాయ్‌కు పాజిటివ్


డాక్టర్‌తో కాంటాక్ట్‌లో ఉన్నవారందర్నీ గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. ఇప్పటికే కాంటాక్ట్‌లో ఉన్న 33 మంది ప్రభుత్వ ఉద్యోగులు సెల్ఫ్ ఐసోలేషన్‌కు వెళ్లారు. తప్పుడు పేరుతో నమూనాలు పంపిన నేరానికి, నిజాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేసినందుకు, కరోనా గైడ్‌లైన్స్ పాటించనందుకు డాక్టర్ రాజన్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. చికిత్స అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. Also read: Tweet: అమితాబ్ తో చిరు ఏమన్నారు?