Amitabh: నిలకడగా ఆరోగ్యం: జయాబచ్చన్‌కు నెగెటివ్, ఐశ్వర్యారాయ్‌కు పాజిటివ్

బాలీవుడ్ బాద్‌షా ( Bollywood Badshah ) అమితాబ్ ( Amitabh ) ఆరోగ్యంపైనే ఇప్పుడందరి దృష్టి నెలకొంది. కరోనా వైరస్ సోకడంతో ఆస్పత్రిలో చేరిన అమితాబ్ బచ్చన్ త్వరగా కోలుకోవాలంటూ ప్రముఖులంతా ట్వీట్లు చేస్తున్నారు. మరోవైపు అమితాబ్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు హెల్త్ బుల్లెటిన్ విడుదల చేశాయి. మరి జయాబచ్చన్, ఐశ్వర్యారాయ్ ల పరీక్షల ఫలితాల్లో ఏం తేలింది?

Last Updated : Jul 12, 2020, 03:48 PM IST
Amitabh: నిలకడగా ఆరోగ్యం: జయాబచ్చన్‌కు నెగెటివ్, ఐశ్వర్యారాయ్‌కు పాజిటివ్

బాలీవుడ్ బాద్‌షా ( Bollywood Badshah ) అమితాబ్ ( Amitabh ) ఆరోగ్యంపైనే ఇప్పుడందరి దృష్టి నెలకొంది. కరోనా వైరస్ సోకడంతో ఆస్పత్రిలో చేరిన అమితాబ్ బచ్చన్ త్వరగా కోలుకోవాలంటూ ప్రముఖులంతా ట్వీట్లు చేస్తున్నారు. మరోవైపు అమితాబ్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు హెల్త్ బుల్లెటిన్ విడుదల చేశాయి. మరి జయాబచ్చన్, ఐశ్వర్యారాయ్ ల పరీక్షల ఫలితాల పరిస్థితి  ఏమిటి?

కరోనా పాజిటివ్‌గా ముంబాయిలోని నానావతి ( Mumbai Nanavathi Hospital ) ఆస్పత్రిలో చేరిన అమితాబ్ బచ్చన్ ( Amitabh Bachan Health status ) ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ప్రస్తుతం కోవిడ్ 19 వైరస్ ( Covid 19 virus ) లక్షణాలు స్వల్ప స్థాయిలో ఉన్నాయని...ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు ఆస్పత్రి యాజమాన్యం విడుదల చేసిన హెల్త్ బుల్లెటిన్‌లో ( Amitabh Health bulletin ) పేర్కొన్నారు.  అటు ఆయన తనయడు అభిషేక్ బచ్చన్ ( Abhishek Bachan ) ఆరోగ్యం కూడా మెరుగ్గానే ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. Also read: Tweet: అమితాబ్ తో చిరు ఏమన్నారు?

తండ్రీకొడుకులకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో జయాబచ్చన్, ఐశ్వర్యారాయ్‌లకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా..జయాబచ్చన్‌కు ( Jayabachan ) నెగెటివ్‌గా తేలగా.. ఐశ్వర్యారాయ్కు ( Aishwarya roy ) పాజిటివ్ గా తేలింది. ప్రాధమికంగా చేసిన యాంటీజెన్ పరీక్ష ( Antizen test ) ల్లో మాత్రం ఇద్దరికీ నెగెటివ్ అని తేలింది.  పూర్తి స్థాయి నిర్ధారణ కోసం ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు ( RT-PCR Test ) నిర్వహించారు.  

బాలీవుడ్ దిగ్గజం అమితాబ్‌కు కరోనా సోకిందని తెలియగానే అందరూ నివ్వెరపోయారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడాలంటూ ఆకాంక్షిస్తూ ట్వీట్స్ చేస్తున్నారంతా. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్,  ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మెగాస్టార్ చిరంజీవి,  ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఇతర ప్రముఖులు ట్వీట్స్ చేస్తూ అమితాబ్ ఆరోగ్య సమాచారం తెలుసుకుంటున్నారు. Also read: Abhishek Bachchan: అభిషేక్ బచ్చన్‌కి కరోనా పాజిటివ్

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x