అసలు నిజం దాచిన కంపెనీ.. 17 మందికి కరోనా.. సంస్థపై కేసు నమోదు
విదేశాలకు వెళ్లొచ్చిన వారి వల్లే కరోనావైరస్ (Coronavirus) అధికంగా వ్యాపిస్తోందని అనేక సందర్భాల్లో నిరూపితమైన నేపథ్యంలో విదేశాలకు వెళ్లొచ్చిన వారి వివరాలను అధికారులకు ఇవ్వాల్సిందిగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వాణిజ్య సంస్థలను ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఆదేశిస్తూనే ఉన్నాయి.
నొయిడా: విదేశాలకు వెళ్లొచ్చిన వారి వల్లే కరోనావైరస్ (Coronavirus) అధికంగా వ్యాపిస్తోందని అనేక సందర్భాల్లో నిరూపితమైన నేపథ్యంలో విదేశాలకు వెళ్లొచ్చిన వారి వివరాలను అధికారులకు ఇవ్వాల్సిందిగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వాణిజ్య సంస్థలను ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఆదేశిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ తమ సంస్థలో విదేశాలకు వెళ్లొచ్చిన ఉద్యోగుల వివరాలను (Employees travel history) గోప్యంగా ఉంచి ఇంకొందరికి కరోనావైరస్ వ్యాపించేందుకు కారణమైందనే నేరం కింద ఉత్తర్ ప్రదేశ్ నొయిడాలోని ఓ ప్రైవేటు కంపెనీపై పోలీసులు కేసు నమోదు చేశారు. గౌతంబుద్ధ్ నగర్ (Gautam Buddh Nagar) జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ అనురాగ్ భార్గవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీజ్ ఫైర్ (Cease fire) అనే సంస్థపై థానా ఎక్స్‌ప్రెస్ వే పోలీసులు కేసు నమోదు చేశారు. ప్యాండెమిక్ యాక్ట్ 1897 (Pandemic ACT 1897) కింద పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.
Read also : ముఖ్యమంత్రి సహాయనిధికి భారీ విరాళాలు
ఇటీవలే విదేశాల నుండి వచ్చిన ఈ సంస్థ ఉద్యోగుల గురించి సంస్థ వివరాలు వెల్లడించలేదు. అంతేకాకుండా కనీసం ఉద్యోగులను హోమ్ క్వారంటైన్‌లో ఉండాల్సిందిగానూ ఆదేశించలేదు. ఫలితంగా సంస్థలో పనిచేస్తోన్న ఉద్యోగులు యధావిధిగా బయటికి రావడంతో ఆ వైరస్ (COVID) ఇతరులకు కూడా సోకిందని.. అసలు నొయిడాలో కరోనా వైరస్ వ్యాపించడానికి కారణమే సీజ్ ఫైర్ సంస్థ నిర్లక్ష్య వైఖరి అంటూ గౌతంబుద్ధ్ నగర్ మెడికల్ ఆఫీసర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Read also : WhatsApp banking: వాట్సాప్ ద్వారా బ్యాంకింగ్ సేవలు
సీజ్ ఫైర్ సంస్థలో పనిచేస్తోన్న సిబ్బందిలో 13 మందికి కరోనావైరస్ పాజిటివ్ (Coronavirus positive cases) అని తేలింది. అంతేకాకుండా ఆ సంస్థకు చెందిన సిబ్బంది నివాసం ఉంటున్న సొసైటీలో మరో నలుగురికి కూడా వైరస్ వ్యాపించింది. మొత్తంగా సోమవారం ఉదయం వరకు గౌతంబుద్ధ్ నగర్ జిల్లాలో 31 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదైతే... అందులో 17 పాజిటివ్ కేసులు (13 మంది సీజ్ ఫైర్ కంపెనీ సిబ్బంది+మరో నలుగురు సిబ్బంది నివాసం ఉండే చోట సొసైటీకి చెందిన వారు) కేవలం సీజ్ ఫైర్ అనే సంస్థ నిర్లక్ష్యం వల్లే వ్యాపించాయని చీఫ్ మెడికల్ ఆఫీసర్ అనురాగ్ భార్గవ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Read also : లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు.. వలసదారులకు గుడ్ న్యూస్
సోమవారం ఉదయం వరకు భారత్ లో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1024 కాగా.. ఉత్తర్ ప్రదేశ్‌లో (Uttar Pradesh) మొత్తం 78 మందికి వైరస్ పాజిటివ్ అని గుర్తించినట్టు సంబంధిత అధికారులు తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..