లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు.. వలసదారులకు గుడ్ న్యూస్

బతుకుదెరువు కోసం వేర్వేరు ప్రాంతాలకు వలస వెళ్లిన వాళ్లంతా లాక్‌డౌన్ (Lockdown) నేపథ్యంలో తమ తమ స్వస్థలాలకు తిరుగు ముఖం పట్టిన సంగతి తెలిసిందే. అయితే, లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అన్ని రవాణా సౌకర్యాలు రద్దు చేయడంతో సొంత ఊర్లకు బయల్దేరిన వలసదారులకు ఎటువంటి రవాణా సదుపాయం లేక వందల కిలోమీటర్ల దూరాన్ని సైతం దూర భారం లెక్కచేయకుండా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొని ఉంది.

Last Updated : Mar 29, 2020, 01:06 AM IST
లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు.. వలసదారులకు గుడ్ న్యూస్

న్యూ ఢిల్లీ: బతుకుదెరువు కోసం వేర్వేరు ప్రాంతాలకు వలస వెళ్లిన వాళ్లంతా లాక్‌డౌన్ (Lockdown) నేపథ్యంలో తమ తమ స్వస్థలాలకు తిరుగు ముఖం పట్టిన సంగతి తెలిసిందే. అయితే, లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అన్ని రవాణా సౌకర్యాలు రద్దు చేయడంతో సొంత ఊర్లకు బయల్దేరిన వలసదారులకు ఎటువంటి రవాణా సదుపాయం లేక వందల కిలోమీటర్ల దూరాన్ని సైతం దూర భారం లెక్కచేయకుండా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. ఇంకొన్ని ప్రాంతాల్లో మార్గం మధ్యలో పోలీసులు ముందుకు వెళ్లనివ్వని పరిస్థితులు కూడా కనిపిస్తుండంటంతో కొంతమంది వలసదారులు మార్గం మధ్యలోనే ఏదో ఓ ప్రాంతంలో చిక్కుకుపోవాల్సిన (Migrants stranded) పరిస్థితి ఏర్పడింది. దీంతో వారి ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి.

Read also : కరోనా వైరస్‌కి సంబంధించి మరిన్ని తాజా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ నేపథ్యంలో వారికి కలుగుతున్న ఇబ్బందులు, అసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తాజాగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు పలు ఆదేశాలు జారీచేసింది. ఈ విపత్తు నిర్వహణ (Disaster management) కోసం స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) నిధులను ఉపయోగించుకుని లాక్ డౌన్ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్తున్న వలసదారులకు ఆహారం, నీరు, బస వసతి (Food, water, shelter) సౌకర్యాలు అందించాల్సిందిగా కేంద్రం తమ ఆదేశాల్లో స్పష్టంచేసింది. 

Read also : Akshay Kumar: రూ.25 కోట్ల భారీ విరాళం ప్రకటించిన స్టార్ హీరో

వలసదారులకు మార్గం మధ్యలో ఎటువంటి ఇబ్బందులు ఎదురవకుండా వారి కోసం తాత్కాలిక బస సౌకర్యం అందించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఇందుకోసం విపత్తు నిర్వహణ చట్టంలోని నిబంధనలను మార్చినట్టు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో వలసదారులకు కొంత ఉపశమనం (Relief to migrants) కలగనుంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News