Shimla Accident: హిమాచల్​ప్రదేశ్‌లో (Himachal Pradesh) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం సిమ్లా జిల్లాలోని (Shimla District) కుప్వి ప్రాంతంలో (Kupvi area) చోటుచేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మంచు దట్టంగా కురుస్తున్న (Heavy snow) రోడ్డుపై ప్రయాణించడం వల్ల కారు అదుపు తప్పి.. లోయలో పడిపోయింది. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. బాధితులు కుప్విలోని నౌరా-బౌరా పంచాయతీ నివాసితులుగా పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.


హిమాచల్​ ప్రదేశ్​లో భారీగా మంచు కురుస్తోంది. ఉష్ణోగ్రతలు మైనస్​లోకి పడిపోతున్నాయి. ఎత్తైన ప్రాంతాల్లో జలపాతాలు, పైపుల్లో నీరు గడ్డకట్టిపోయింది. మంచు దుప్పటితో ఆయా ప్రాంతాలు శ్వేతవర్ణశోభితమై కనువిందు చేస్తున్నాయి. హిమపాతాన్ని (Snowfall) ఆస్వాదించేందుకు సిమ్లా, మనాలి వంటి ప్రాంతాలకు పర్యాటకులు పోటెత్తుతున్నారు.


భారీగా పేరుకుపోయిన మంచులో ఆటలు ఆడుతూ ఆనందంగా గడుపుతున్నారు. టూరిస్ట్ లు దట్టమైన మంచు కురుస్తున్న ప్రదేశాల్లో ప్రయాణించటం వల్ల తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల భారీగా మంచు కురువటంతో..వాహనాల్లో చిక్కుకొని 22 మంది మృతి చెందిన ఘటనల పాక్ (Pakistan) లోని ముర్రేలో చోటుచేసుకుంది. 


Also Read: Pakistan: ముర్రేలో భారీగా కురిసిన మంచు...వాహనాల్లో చిక్కుకొని 22 మంది మృతి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి