Asaduddin Owaisi: పార్టీ చీఫ్‌ను కలిసిన బీహార్ ఎంఐఎం ఎమ్మెల్యేలు
బీహార్ ఎన్నికల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Assembly Election ) మజ్లీస్ పార్టీ (AIMIM) ఐదు సీట్లు గెలుపొందిన విషయం తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకస్థానానికే పరిమితమైన మజ్లీస్.. ఈ ఎన్నికల్లో సత్తచాటింది. అయితే కొత్తగా ఎన్నికైన ఐదుగురు ఎమ్మెల్యేలు ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) ని కలిశారు.
five newly-elected Bihar MLAs of AIMIM meet party chief Asaduddin: హైదరాబాద్: బీహార్ ఎన్నికల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Assembly Election ) మజ్లీస్ పార్టీ (AIMIM) ఐదు సీట్లు గెలుపొందిన విషయం తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకస్థానానికే పరిమితమైన మజ్లీస్.. ఈ ఎన్నికల్లో సత్తచాటింది. అయితే కొత్తగా ఎన్నికైన ఐదుగురు ఎమ్మెల్యేలు ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) ని కలిశారు. గురువారం ఉదయం హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి చేరుకోని కొత్తగా ఎన్నికైన ఐదుగురు ఎమ్మెల్యేలు అసదుద్దీన్ ఓవైసీని కలిసి భేటి అయ్యారు. ఈ సందర్భంగా వారిని అసద్ స్వాగతం పలుకుతూ ఆహ్వానించారు. Also read: Rashmi Gautam: చీరలో వయ్యరాలు ఒలకబోస్తున్న రష్మీ..
అయితే మూడు విడుతల్లో జరిగిన బీహార్ ఎన్నికల్లో మజ్లీస్ పార్టీ 28 స్థానాల్లో పోటీచేసింది. ఇందులో అమౌర్, కొచ్చాదామమ్, జోకిహట్, బైసీ, బహదూర్‌గంజ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంఐఎం గెలుపొందింది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా సీమాంచల్ రీజియన్‌లో ఎంఐఎం అభ్యర్థులను బరిలో నిలిపి సత్తా చాటింది. దీంతోపాటు ఈ ప్రాంతంలో అసదుద్దీన్ సైతం ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానానికే పరిమితమైన మజ్లీస్ ఈసారి తన సంఖ్యను ఐదుకు పెంచుకోవడంపై పలువురు పార్టీ నేతలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. Also read: Adah Sharma: అందంతో ఆకట్టుకుంటున్న ఆదా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe