Accident: 5 dead and 35 injured in Maharashtra: ఢిల్లీ: మహారాష్ట్ర ( Maharashtra) లో ఘోర ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళుతున్న బస్సు లోయలో పడటంతో ( bus Accident ) ఐదుగురు అక్కడికక్కడే మరణించగా.. 35 మంది గాయాలపాలయ్యారు. ప్రైవేటు బస్సు మల్కాపుర్ నుంచి గుజరాత్‌లోని సూరత్‌కు వెళుతుండగా.. మహారాష్ట్రలోని నందూర్‌బార్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న ఈ బస్సు బుధవారం తెల్లవారుజామున 3.15 గంటల సమయంలో ఖామ్‌చౌందర్ సమీపంలోని కొండైబారి ఘాట్‌ (Bus Falls Into Gorge )లో పడిందని పోలీసు అధికారు తెలిపారు. Also read: Navratri Day 5: సరస్వతీ నమోస్తుతే.. చదువుల తల్లి అలంకరణలో అమ్మవారు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"195474","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Maharashtra, bus Accident","field_file_image_title_text[und][0][value]":"మహారాష్ట్ర"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Maharashtra, bus Accident","field_file_image_title_text[und][0][value]":"మహారాష్ట్ర"}},"link_text":false,"attributes":{"alt":"Maharashtra, bus Accident","title":"మహారాష్ట్ర","class":"media-element file-default","data-delta":"1"}}]]ఈ బస్సులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, 35 మంది గాయపడ్డారని నందుర్‌బార్ ఎస్పీ మహేంద్ర పండిట్ ( SP Mahendra Pandit) తెలిపారు. బస్సు అతివేగం వల్లనే ఈ ప్రమాదం సంభవించిందని ఎస్పీ తెలిపారు. నిద్రమత్తులో ఉన్న డ్రైవర్  బస్సుపై ఒక్కసారిగా నియంత్రణ కోల్పోవడంతో.. దాదాపు 30 అడుగుల లోతైన లోయలో పడిపోయిందని వివరించారు. ప్రమాదం గురించి సమాచారం అందగానే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం క్షతగాత్రులను బయటకు తీసి.. విసర్వాడిలోని సమీప ఆసుపత్రికి తరలించారు. Also read: Hyderabad Rains: బ్రహ్మాజీకి నెటిజన్ల షాక్.. ట్విట్టర్ నుంచి తప్పుకున్న నటుడు


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe