Goa Results 2022: మరి కాస్సేపట్లో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, గోవాలో మొదలైన క్యాంప్ రాజకీయాలు
Goa Results 2022: దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. హంగ్ ఏర్పడుతుందనే ఎగ్జిట్ పోల్స్ సర్వేల నేపధ్యంలో అందరి దృష్టీ గోవాపై పడింది. పాశ్చాత్త సంస్కృతి నిండా కన్పించే గోవాలో..అప్పుడే క్యాంపు రాజకీయాలు ప్రారంభమవుతున్నాయి.
Goa Results 2022: దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. హంగ్ ఏర్పడుతుందనే ఎగ్జిట్ పోల్స్ సర్వేల నేపధ్యంలో అందరి దృష్టీ గోవాపై పడింది. పాశ్చాత్త సంస్కృతి నిండా కన్పించే గోవాలో..అప్పుడే క్యాంపు రాజకీయాలు ప్రారంభమవుతున్నాయి.
ఎక్కడైనా సరే ఫలితాల అనంతరం క్యాంపు రాజకీయాలు మొదలవుతాయి. కానీ గోవాలో మాత్రం ఫలితాల రాకుండానే కేవలం ఎగ్జిట్ పోల్స్ పలితాల్ని బట్టి రాజకీయ పార్టీలు అప్రమత్తమవుతున్నాయి. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్..గోవాలో హంగ్ ఏర్పడనుందనే సంకేతాలిచ్చాయి. దాంతో గోవాలో క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి. గత అనుభవం దృష్టా కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమవుతోంది. గత ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 13 మందినే గెల్చుకున్నా..చిన్నాచితకా పార్టీలు, సభ్యుల మద్దతుతో అధికారం చేపట్టింది. ఈసారి ఆ అవకాశం ఇవ్వకూడదనేది కాంగ్రెస్ ఆలోచన. అటు ఆప్ కూడా గోవాలో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ నేతలు చిదంబరం, డీకే శివకుమార్, దినేష్ గుండూరావులు గోవాలో మకాం వేశారు. అటు బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, ఫడ్నవిస్‌లు గోవా చేరుకున్నారు. ఇప్పటికే బీజీపే స్వతంత్య అభ్యర్ధులతో టచ్‌లో ఉందని సమాచారం. కాంగ్రెస్ పార్టీ అప్పుడే తన అభ్యర్ధుల్ని రిసార్ట్స్‌కు మార్చింది.
గోవాలో మొత్తం 40 స్థానాలున్నాయి. బీజేపీ మొత్తం అన్ని స్థానాల్లో పోటీ చేయగా..కాంగ్రెస్ పార్టీ 37 సీట్లలో , మిత్రపక్షం జీఎఫ్పీ 3 సీట్లలో పోటీ చేసింది. ఇక ఆప్ 39 స్థానాల్లో సొంతంగా పోటీ చేయగా..ఒక స్థానంలో ఇండిపెండెంట్‌కు మద్దతిచ్చింది. టీఎంసీ 26 స్థానాల్లో, ఎంజీపీ 13, ఎన్సీపీ 13, శివసేన 10 స్థానాల్లో పోటీ చేశాయి. బీజేపీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్ధి ప్రమోద్ సావంత్ మొత్తం వ్యవహారాల్ని చక్కబెడుతున్నారు. ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా అమిత్ పాలేకర్ రంగంలో దిగగా..కాంగ్రెస్ ఇంకా ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటించలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ గత ఎన్నికల్లో సీట్లు గెలవకపోయినా..6.27 శాతం ఓట్లు చేజిక్కించుకుంది. గతం కంటే ఈసారి పుంజుకోవడంతో కచ్చితంగా సీట్లు గెలిచే అవకాశాలున్నాయి. హంగ్ ఏర్పడనుందనే సర్వేల నేపధ్యంలో ఆప్ పార్టీ కీలకంగా మారనుంది.
Also read: Election results 2022: రేపే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు- యూపీ, పంజాబ్‌పైనే అందరి చూపు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook