ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో నిర్మాణంలో వున్న బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 12 మంది వరకు చనిపోయినట్టు తెలుస్తోంది. కూలిన బ్రిడ్జి కింద ఇంకెంతోమంది చిక్కుకున్నట్టు సమాచారం అందుతోంది. వారణాసి దుర్ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 

ఇదిలావుంటే, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు వారణాసిలో పరిస్థితిని స్వయంగా సమీక్షించేందుకు ఉప ముఖ్యమంత్రి కేపీ మౌర్య, మరో మంత్రి నీలకంఠ్ తివారి వారణాసి బయల్దేరినట్టు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ పేర్కొంది. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులు ఏంటనే వివరాలపై మరింత సమాచారం అందాల్సి వుంది.