పాట్నా: పౌరసత్వ సవరణ చట్టం (CAA), ఎన్‌ఆర్‌సీ అంశాలు నేటికీ దేశంలో సమస్యగా మారాయి. గత కొన్ని రోజులుగా ప్రతిపక్షాలు సీఏఏ, ఎన్‌ఆర్‌సీలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కేరళ, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు సీఏఏను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలలో తీర్మానాలు చేసిన విషయం తెలిసిందే. ఇవే అంశాలు జనతా దళ్ (యునైటెడ్) పార్టీలో ముసలం రేపుతోంది. ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ ఇష్టం ఉంటేనే పార్టీలో కొనసాగాలని, లేని పక్షంలో ఏ క్షణమైనా పార్టీ వీడవచ్చునని బిహార్ సీఎం నితీష్ కుమార్ పరోక్షంగా వ్యాఖ్యానించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ, ఎన్‌ఆర్‌సీలను ప్రశాంత్ కిషోర్ వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీలను ఉద్దేశించి కామెంట్లు చేస్తున్నారు. పలు పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ఆయనను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను.. పార్టీ నియమాలకు కట్టుబడి ఉండాలనుకుంటే పార్టీలో కొనసాగాలి, లేనిపక్షంలో పార్టీని వీడవచ్చునంటూ ప్రశాంత్ కిషోర్‌ను ఉద్దేశించి బిహార్ సీఎం పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు.



కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సలహా మేరకు తాము ప్రశాంత్ కిషోర్‌ను జేడీయూలోకి తీసుకున్నామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఓటర్లు ఫిబ్రవరి 8న ప్రేమతో ఈవీఎం బటన్లు నొక్కుతారని, వాళ్లు ఎవరినీ ఇబ్బందులకు గురిచేసే రకం కాదని ప్రశాంత్ కిషోర్ చేసిన ట్వీట్‌పై నితీష్ హ్యాపీగా లేరు. కాగా, సీఏఏ, ఎన్ఆర్‌సీ అంశాలపై జేడీ(యూ) నేతల వైఖరిని సైతం ప్రశాంత్ కిషోర్ ప్రశ్నించడం పార్టీ నేతలను ఇరుకున పెడుతోంది. త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (APP)కి వ్యూహకర్తగా ఆయన పని చేస్తున్న విషయం తెలిసిందే.


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..