Bhagat Singh Facts: భగత్‌సింగ్ గురించి ఈ నిజాలు మీకు తెలుసా?
Bhagat Singh Facts: భగత్ సింగ్.. ఈ పేరు ఎంతో మంది యువతకు స్పూర్తినిస్తుంది. మరెంతో మందిలో ధైర్యం నింపుతుంది. భారత స్వేచ్ఛ కోసం పోరాటం చేసి.. అతి చిన్న వయసులో ప్రాణాలు కోల్పోయారు భగత్. నేడు ఆయన 91వ వర్ధంతి. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.
Bhagat Singh Facts: స్వాతంత్ర్యోద్యమం గురించి చర్చ వస్తే.. చాలా మంది పేర్లు గుర్తొస్తాయి. కానీ అతి చిన్న వయస్సులో (23 ఏళ్లు) ఉద్యమం బాట పట్టి. ఆంగ్లేయులకు తలొగ్గకుండా ప్రాణాలు సైతం విడిచిన యోధుడిగా.. భగత్ సింగ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది.
భగత్ సింగ్ మరణించి నేటికి సరిగ్గా 91 సంవత్సరాలు అయ్యింది. అయినా ఇప్పటికీ కోట్లాది మంది యువతకు ఆయనో ఆదర్శం. ఆయన తెగువ ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది అనడంలో సందేహం లేదు. భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా.. ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
భగత్ సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..
1. జలియన్ వాలాబాగ్ హింసాకాండ భగత్ సింగ్‌పై తీవ్రంగా ప్రభావం చూపింది. ఈ ఘటననే ఆయన్ను స్వాతంత్ర్యోద్యమం వైపు అడుగులు వేసేలా చేసింది. ఈ ఘటన జరిగినప్పుడు ఆయన వయస్సు 12 ఏళ్లు మాతమే. బడికి వెళ్లకుండా.. ఆ రక్తపాతం జరిగిన చోటుకు వెళ్లి పరిశీలించే వారు.
2. చిన్నప్పుడే భగత్ సింగ్‌కు గన్స్ గురించి మాట్లాడేవారు. పొలాల్లో గన్స్ పెంచాలని ఆయన భావించే వారు (చిన్నప్పుడు). వాటితో బ్రిటీష్ వాళ్లపై యుద్ధం చేయొచ్చని భావించేవారు.
3. భగత్ సింగ్ సిక్కు కుటుంబంలో జన్మించారు. అయినప్పటికీ బ్రిటీష్ అధికారిని చంపిన కేసులో.. అరెస్ట్ చేయకుండా, గుర్తించడానికి వీలు లేకుండా.. లహోర్ను వీడి కోల్‌కతాకు తప్పించుకునేందుకు గడ్డం గీసుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం వంటి పనులు చేశారు.
4. భగత్ సింగ్ కాలేజీలో చదువుకునే సమయంలో మంచి నటుడు కూడా. రాణా ప్రతాప్, సామ్రాట్ చంద్రగుప్త, భరత్ దుర్దశ వంటి నాటకాల్లో నటించారు. ఆయన నటనా ప్రావిణ్యంతో ప్రజలను బ్రటీషర్లపై తిరుగుబాటు చేసేలా ప్రేరేపించే వారు.
5.భగత్ సింగ్‌కు మార్చి 1931 మార్చి 24 ఉరి శిక్ష విధించాలని అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఆ తర్వాత దానిని 11 గంటల ముందుగా.. అంటే 1931 మార్చి 23 రాత్రి 7.30కి అమలు చేశారు. ఆయనను బ్రిటీషర్లు ఉరి తీసినప్పుడు ఆయన వయసు కేవలం 23 ఏళ్లు.
Also read: Paddy Procurement: ముదురుతున్న వరి వివాదం.. లేటెస్ట్ అప్డేట్
Also read: Covid-19 Guidlines: కరోనాపై కొత్త మార్గదర్శకాలని జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook