Kala Jathedi, Anuradha Choudhary Marriage: గ్యాంగ్‌స్టర్‌ అంటే ఒక ముఠాకు నాయకుడు. తన ముఠాతో సెటిల్‌మెంట్లు, వివాదాలు పరిష్కరించడంతోపాటు స్థానికంగా ఒక వ్యవస్థను నడిపినట్టు గ్యాంగ్‌ పని ఉంటుంది. అలాంటి గ్యాంగ్‌స్టర్‌కు మరో గ్యాంగ్‌స్టర్‌ దొరికితే.. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటదో కదా. అచ్చం అదే జరిగింది. ఇద్దరు గ్యాంగ్‌స్టర్లు పెళ్లాడారు. ఈ వివాహం ఢిల్లీలో జరగ్గా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గ్యాంగ్‌స్టర్ల వివాహం కావడంతో ప్రత్యర్థులు దాడి చేస్తారనే భయంతో ఏకంగా 300కు పైగా భద్రతా సిబ్బందిని ఏర్పాటుచేశారు. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Betting: బెట్టింగ్‌లకు రూ.15 కోట్ల అప్పు.. మోసం చేసి విదేశాలకు పారిపోతుంటే అడ్డంగా దొరికిన మిషన్‌ భగీరథ ఏఈ


 


హరియాణాకు చెందిన సందీప్‌ అలియాస్‌ కాలా జథేడీ ఓ గ్యాంగ్‌స్టర్‌. రాజస్థాన్‌కు చెందిన అనురాధ చౌదరి అలియాస్‌ మేడమ్‌ మింజ్‌ కూడా గ్యాంగ్‌స్టర్‌. వీరిద్దరూ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఎలా పరిచయం జరిగిందో తెలియదు కానీ వీరిద్దరి వృత్తి ఒక్కటే. సెటిల్‌మెంట్‌లు, దందాలు చేసుకునే వీరి మరింత దగ్గరయ్యారు. ఈ సమయంలోనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ ద్వారకా సెక్టార్‌-3లోని సంతోష్‌ గార్డెన్‌ను రూ.51 వేలు చెల్లించి బుక్‌ చేసుకున్నారు. పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు జరిగాయి. మంగళవారం వేదమంత్రాల మధ్య సందీప్‌, అనురాధ ఒక్కటయ్యారు. ఆ దంపతులను కొందరు గ్యాంగ్‌స్టర్లు, వారి అభిమానులు, మద్దతుదారులు వచ్చి ఆశీర్వదించారు. 

Also Read: Siddham Meeting: రెండు కుటుంబాల్లో విషాదం మిగిల్చిన జగన్‌ 'సిద్ధం' సభ.. ఇద్దరు మృతి


 


అయితే ఈ పెళ్లి కోసం కనీవినీ ఎరుగని రీతిలో భద్రతా వ్యవస్థ ఏర్పాటుచేశారు. ప్రవేశ మార్గాల్లో మెటల్‌ డిటెక్టర్లు ఏర్పాటుచేయగా.. బార్‌కోడ్‌ బ్యాండ్లు, వాహనాలకు ప్రవేశ పాసులు ఇచ్చారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో భద్రతా ఏర్పాట్లు చేశారు. 250 మంది పైగా ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. కాగా ఒక్కటైన వధూవరులపై చాలా కేసులు ఉన్నాయి. సందీప్‌పై హర్యానాలో దోపిడీ, హత్య, హత్యాయత్నం తదితర కేసులు ఉన్నాయి. అనురాధపై కూడా మనీలాండరింగ్‌, కిడ్నాప్‌, బెదిరింపులు తదితర మొత్తం 76 కేసులు నమోదు ఉన్నాయి. అతడిని పట్టిస్తే రూ.7 లక్షల నగదు బహుమానం కూడా ఉంది.

ఇక అనురాధకు 'రివాల్వర్‌ రాణి' అనే గుర్తింపు ఉంది. కాగా సందీప్‌ ప్రస్తుతం తిహార్‌ జైల్లో ఉంటున్నాడు. పెళ్లి కోసం కేవలం ఆరు గంటల పాటు పెరోల్‌పై బయటకు వచ్చాడు. పెళ్లి తర్వాత మళ్లీ జైల్లో లొంగిపోయాడు. వీరి పెళ్లి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రౌడీల పెళ్లిళ్లు సినిమాల్లో చూశాం.. నిజంగా జరుగుతాయని నమ్మలేదు అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. 'ఏ గ్యాంగ్‌స్టర్లకు ప్రేమ ఉండదా? పెళ్లిళ్లు జరగవా?' అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఆ రౌడీ దంపతులకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter