Sad Incident: బాపట్ల జిల్లాలోని మేదరమెట్లలో ఆదివారం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 'సిద్ధం' బహిరంగ సభ పెద్ద ఎత్తున నిర్వహించింది. సభకు లక్షలాది సంఖ్యలో ప్రజలను తరలించే ప్రయత్నం చేశారు. పార్టీ అధినేత, సీఎం జగన్ ఈ సభా ప్రాంగణం నుంచి కీలక ప్రసంగం చేశారు. వచ్చే ఎన్నికలకు సిద్ధమని ప్రకటించారు. అయితే ఈ సభ ద్వారా కొన్ని విషాద సంఘటనలు చోటుచేసుకున్నాయి. రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపగా.. మరో ఇద్దరు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Also Read: Chungreng Koren: 'మణిపూర్ మంటల్లో కాలుతుంది మోదీజీ ఒక్కసారి రండి' కన్నీళ్లతో చాంపియన్ విజ్ఞప్తి
సభా ప్రాంగణం ప్రజలతో నిండిపోవడంతో కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతోపాటు పెద్ద ఎత్తున రాకపోకలు సాగిస్తుండగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఓ వ్యక్తి మృతి చెందగా.. ఈ సభకు హాజరై తిరిగి వెళ్తున్న క్రమంలో ఓ యువకుడు బస్సులో నుంచి కిందపడి మృతి చెందాడు. ఓ ఏఎస్సై గుండెపోటుకు గురవడంతో అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
Also Read: KN Rajannna: జై పాకిస్థాన్ అనే కొడుకుల్ని కాల్చి చంపాలి: మంత్రి సంచలన వ్యాఖ్యలు
సభ ముగిసిన అనంతరం సీఎం జగన్ వెళ్లిపోయిన తర్వాత ఒక్కసారిగా ప్రజలకు బయటకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఇద్దరు అస్వస్థతకు గురవగా.. చికిత్స కోసం అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఒకరు మృతి చెందారని వైద్యులు తెలిపారు. మృతుడి వివరాలు తెలుసుకోగా ఒంగోలులోని బలరాం కాలనీకి చెందిన ఉదరగుడి మురళి (30)గా గుర్తించారు. ఒంగోలు నగరపాలక సంస్థలో పారిశుద్ధ్య కార్మికుడిగా అతడు పని చేస్తున్నట్లు తెలిసింది. మృతదేహాన్ని ఒంగోలులోని రిమ్స్‌కు తరలించారు. అస్వస్థతకు గురైన మరో వ్యక్తి చికిత్స పొందుతున్నారు.
మేదరమెట్లలో జరిగిన వైసీపీ ‘సిద్ధం’ సభకు వెళ్లి వస్తున్న క్రమంలో యువకుడు బస్సు కింద పడి చనిపోయాడు. పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన గేదెల బాలదుర్గ 'సిద్ధం' సభకు హాజరై తిరిగి స్వగ్రామం వెళ్లేందుకు పార్టీ ఏర్పాటుచేసిన బస్సులో వెళ్తున్నాడు. బస్సు ముందు డోర్ వద్ద నిల్చొని ఉన్న బాలదుర్గ ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడ్డాడు. బస్సు వెనుక చక్రాలు తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. గోపాలపురం మలుపు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter
Siddham Meeting: రెండు కుటుంబాల్లో విషాదం మిగిల్చిన జగన్ 'సిద్ధం' సభ.. ఇద్దరు మృతి