మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే (Vikas Dubey Arrested) అరెస్టయ్యాడు. కాన్పూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్ కేసు(Kanpur Encounter case)లో 8 మంది పోలీసులను దారుణంగా హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడు వికాస్ దూబేను మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయనిలో పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక మహాకాళి ఆలయాన్ని సందర్శించడానికి వచ్చిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబేను గురువారం ఉదయం పోలీసులు నాటకీయ పరిణామాల నడుమ అదుపులోకి తీసుకున్నారని యూపీ పోలీసులు తెలిపారు.  కాన్పూర్ ఎన్‌కౌంటర్ కేసు.. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు నిందితులు హతం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యూపీలోని కాన్పూర్ ఎన్‌కౌంటర్ కేసులో కొందరు పోలీసుల నుంచి ముందే సమాచారం అందుకున్న వికాస్ దుబే (Vikas Dubey) గ్యాంగ్ ప్లాన్ ప్రకారం కాల్పులు జరిపడంతో డీఎస్సీ సహా 8 మంది పోలీసులు చనిపోవడం తెలిసిందే. కరడుగట్టిన నేరస్తుడు వికాస్ దుబే ఢిల్లీ-మథుర హైవేలోని ఓ హోటల్‌లో దాక్కున్నట్లు సమాచారం అందుకుని బుధవారం అక్కడ ఆకస్మిక దాడులు చేసి అతడి అనుచరులను అదుపులోకి తీసుకున్నారు.  వికాస్ దుబేపై రివార్డు 5 లక్షలకు పెంపు.. పలు రాష్ట్రాల్లో అలర్ట్



దేశ వ్యాప్తంగా మొత్తం 20కి పైగా పోలీస్ టీమ్స్ గత ఆరు రోజులుగా ముమ్మరంగా గాలించారు. ఎట్టకేలకు ఉజ్జయినీలో గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబేను అదుపులోకి (Vikas Dubey Arrested In Ujjain) తీసుకున్నారు. నేటి ఉదయం ఉజ్జయినీ మహాకాళీ ఆలయానికి వచ్చిన నిందితుడు వికాస్ దుబేను గుర్తించిన భద్రతా సిబ్బంది అతడ్ని అదుపులోకి తీసుకుంది. ఈ సమాచారాన్ని ఉజ్జయినీ ఎస్పీ మనోజ్ సింగ్‌కు సమాచారమివ్వగా టీమ్ వెళ్లి వికాస్ దుబేను అరెస్ట్ చేసింది. ఈ విషయాన్ని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌కు మధ్యప్రదేశ్ డీజీపీ సమాచారం అందించినట్లు తెలుస్తోంది.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    
RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos