పాట్నా: స్వాతంత్య్ర సంగ్రామం సమయంలో, ఇతర దేశాల్లో ఉన్న హిందువులను భారతదేశానికి తీసుకురావడంలో విఫలమైనందుకు దేశం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మరోసారి తాజా వివాదానికి కారణమయ్యారు. ముస్లిం జనాభా అధికంగా ఉన్న బీహార్‌లోని సీమాంచల్ ప్రాంతంలోని పూర్నియా జిల్లాలో, పౌరసత్వ సవరణ చట్టానికి(2019) మద్దతుగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సభలో సీఏఏ 2019, అవసరాన్ని తెలియజేస్తూ ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ "మా పూర్వీకులు బ్రిటిష్ పాలన నుండి  స్వాతంత్య్రం కోసం పోరాడుతున్నప్పుడు, మహమ్మద్ అలీ జిన్నా ఇస్లామిక్ రాజ్యం ఏర్పాటు కోసం ప్రయత్నించారని, ఈ అంశం అప్పట్లో పాకిస్తాన్ వేసిన విత్తనమని ఆయన పేర్కొన్నారు. కాగా పాకిస్తాన్ ఒప్పుకొనిఉంటే ఇప్పుడీ సమస్య వచ్చేసి కాదని ఆయన పేర్కొన్నారు. 


కాగా, మా పూర్వీకులు  తప్పు చేసారని, ఆ సమయంలోనే ముస్లిం సోదరులందరినీ పాకిస్థాన్‌కు పంపించి, అక్కడున్న హిందువులను ఇక్కడికి రప్పించి ఉంటే పౌరసత్వ సవరణ చట్టం వసరం ఉండేది కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమయ్యేందుకు రాష్ట్ర వ్యాప్తంగా "బీహార్ ఫస్ట్-బిహారీ ఫస్ట్" యాత్రను ప్రారంభించిన యువ ఎల్జెపి చీఫ్ చిరాగ్ పాశ్వాన్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తీవ్రంగా ఖండించారు. 
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..