Girl ran away from Delhi: చదువుపై శ్రద్ధ పెట్టమని తల్లిదండ్రులు మందలించినందుకు... ఇంట్లో నుంచి పారిపోయింది ఓ బాలిక. చెప్పా పెట్టకుండా ఒంటరిగా బయటకొచ్చేసింది. నేరుగా రైల్వే స్టేషన్‌‌కు వెళ్లి.. అక్కడ ఆగివున్న రైలు ఎక్కింది. అలా ఢిల్లీ నుంచి మహారాష్ట్ర చేరుకుంది. అక్కడ ఓ ఆటో డ్రైవర్ బాలిక ఇంట్లో నుంచి పారిపోయి వచ్చినట్లు గుర్తించి పోలీసులను అలర్ట్ చేశాడు. వెంటనే పోలీసులు బాలిక తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. దీంతో ఎట్టకేలకు బాలిక మళ్లీ తల్లిదండ్రుల చెంతకు చేరింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోలీసుల కథనం ప్రకారం... న్యూఢిల్లీలోని పుష్ప విహార్‌కి చెందిన బాలిక (14) శనివారం (జనవరి 29) మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలోని వసాయ్ రైల్వే స్టేషన్‌లో రైలు దిగింది. రైల్వే స్టేషన్ నుంచి బయటకొచ్చిన బాలిక... అక్కడో ఆటో డ్రైవర్ కనిపించడంతో అతని వద్దకు వెళ్లింది. ఇక్కడ ఉండటానికి గదులు దొరుకుతాయా అని అతన్ని ఆరా తీసింది.


ఆటో డ్రైవర్‌కు అనుమానం రావడంతో బాలిక వివరాలు ఆరా తీశాడు. ఢిల్లీ నుంచి బాలిక ఒంటరిగా అక్కడికి చేరినట్లు తెలుసుకున్నాడు. వెంటనే బాలిక గురించి పోలీసులకు సమాచారమిచ్చిన అతను.. ఆమెను వెంటపెట్టుకుని మానిక్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ పోలీసులు ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నారు. తల్లిదండ్రులు చదువుపై శ్రద్ధ పెట్టాలని ఒత్తిడి చేస్తున్నందునా ఇంట్లో నుంచి పారిపోయి వచ్చినట్లు బాలిక పోలీసులతో చెప్పింది. 


పోలీసులు బాలిక తల్లిదండ్రుల వివరాలు తెలుసుకుని ఫోన్ ద్వారా వారికి సమాచారమిచ్చారు. అప్పటికే బాలిక కిడ్నాప్‌కు గురైనట్లు స్థానిక పోలీస్ స్టేషన్‌లో వారు ఫిర్యాదు చేశారు. మహారాష్ట్ర (Maharashtra) పోలీసుల నుంచి సమాచారం అందడంతో వెంటనే విమానంలో వసాయ్‌కి చేరుకున్నారు. పోలీసుల సమక్షంలో తిరిగి తమ కూతురిని కలుసుకోగలిగారు. తమ కూతురిని గుర్తించి తిరిగి తమవద్దకు చేరేలా చేసినందుకు ఆటో డ్రైవర్‌కు పోలీస్ స్టేషన్‌లో చిరు సత్కారం చేశారు.


Also Read: Kajol Covid Positive: బాలీవుడ్‌ నటి కాజోల్‌కు కరోనా పాజిటివ్...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook